తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. బెంగళూరు నారాయణ హృదయాలయలో తారకరత్నకు చికిత్స కొనసాగుతోంది. ఎక్మో సపోర్ట్‌పైనే ట్రీట్‌మెంట్ జరుగుతోందని వైద్యులు తెలిపారు. కార్డియాలజిస్ట్‌లు, ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్టుల పర్యవేక్షణలో ఉన్నారు తారకరత్న. అయితే, తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా పరిస్థితి విషమంగా ఉందని.. 48 గంటల వరకు వేచి చూడాల్సిందేనని బంధువులు పేర్కొంటున్నారు.
తారకరత్నను చూసేందుకు ఇవాళ బెంగళూరు వెళ్తున్నారు జూ.ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్. వీళ్లిద్దరితోపాటు కుటుంబ సభ్యులు కూడా నారాయణ హృదయాలయ హాస్పిటల్‌కు వెళ్లనున్నారు. పదిన్నర గంటలకు బెంగుళూరు నారాయణ హృదయాలయకు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ రానున్నారు. నిన్న తారకరత్నను చూసేందుకు చంద్రబాబు, నందమూరి కుటుంబసభ్యులు వచ్చారు.
తారకరత్న ఆరోగ్య పరిస్థితిని కుటుంబసభ్యులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. నారాయణ హృదయాలయలో కార్డియాలజిస్ట్‌లు, ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్టులతో చికిత్సను అందిస్తున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై బాలకృష్ణ ఎప్పటికప్పుడు డాక్టర్లతో పర్యవేక్షిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం..