రాజకీయాల్లోకి మహేశ్.. క్లారిటీ ఇచ్చిన నమ్రత

రానున్న ఎన్నికల్లో సూపర్‌స్టార్ మహేశ్ బాబు పోటీ చేయబోతున్నాడంటూ ఇటీవల పుకార్లు షికార్లు చేశాయి. టీడీపీ తరపున పోటీ చేసేందుకు మహేశ్ సిద్ధంగా ఉన్నాడని వార్తలు వస్తోన్న నేపథ్యంలో వాటిపై ఆయన భార్య నమ్రత స్పందించారు. ఎన్నికల్లో మహేశ్ పోటీ చేస్తున్నాడని వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె స్పష్టం చేశారు. చంద్రబాబు అంటే మహేశ్‌కు చాలా గౌరవముందని చెప్పిన నమ్రత.. ఆయన పక్కన కనిపించినంత మాత్రాన మహేశ్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు కాదని తెలిపారు. అలాగే […]

రాజకీయాల్లోకి మహేశ్.. క్లారిటీ ఇచ్చిన నమ్రత

రానున్న ఎన్నికల్లో సూపర్‌స్టార్ మహేశ్ బాబు పోటీ చేయబోతున్నాడంటూ ఇటీవల పుకార్లు షికార్లు చేశాయి. టీడీపీ తరపున పోటీ చేసేందుకు మహేశ్ సిద్ధంగా ఉన్నాడని వార్తలు వస్తోన్న నేపథ్యంలో వాటిపై ఆయన భార్య నమ్రత స్పందించారు. ఎన్నికల్లో మహేశ్ పోటీ చేస్తున్నాడని వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె స్పష్టం చేశారు. చంద్రబాబు అంటే మహేశ్‌కు చాలా గౌరవముందని చెప్పిన నమ్రత.. ఆయన పక్కన కనిపించినంత మాత్రాన మహేశ్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు కాదని తెలిపారు.

అలాగే టీడీపీ తరుపున మహేశ్ ఎలాంటి ప్రచారం చేయబోరని.. ఆ మాటకొస్తే ఏ పార్టీకి ఆయన ప్రచారం చేయరని పేర్కొన్నారు. రాజకీయపరమైన లక్ష్యాలు, ఎన్నికల్లో పోటీ చేయాలనే కోరిక ఏది మహేశ్‌కు లేవని ఆమె చెప్పారు. మహేశ్ సమయమంతా సినిమాలకే సరిపోతుందని.. ఫ్రీగా ఉన్నప్పుడు కుటుంబంకు కేటాయిస్తారని.. కనీసం స్నేహితులను కలిసేందుకు కూడా మహేశ్ బయటకు వెళ్లారని నమ్రత వెల్లడించారు.

Published On - 5:47 pm, Wed, 13 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu