చైతూ మరో హీరోయిన్‌పై కన్నేసిన నాగ్.. మరి ఆ భామ ఒప్పుకుంటుందా..?

‘ఊపిరి’ సినిమా తరువాత నాగార్జున ఖాతాలో చెప్పుకోదగ్గ హిట్ చిత్రాలు లేవు. ఇక ఈ ఏడాది ‘మన్మథుడు 2’తో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఆ మూవీ అట్టర్‌ ఫ్లాప్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనుకుంటున్నాడు నాగ్. దీంతో కొన్ని కథలు విన్న నాగ్.. ఓ కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఆ చిత్రం కోసం నాగచైతన్య హీరోయిన్‌ను సంప్రదించినట్లు సమాచారం. ఇంతకు నాగ్ తదుపరి చిత్రం ఏంటి..? […]

చైతూ మరో హీరోయిన్‌పై కన్నేసిన నాగ్.. మరి ఆ భామ ఒప్పుకుంటుందా..?
TV9 Telugu Digital Desk

| Edited By:

Nov 28, 2019 | 11:45 AM

‘ఊపిరి’ సినిమా తరువాత నాగార్జున ఖాతాలో చెప్పుకోదగ్గ హిట్ చిత్రాలు లేవు. ఇక ఈ ఏడాది ‘మన్మథుడు 2’తో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఆ మూవీ అట్టర్‌ ఫ్లాప్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనుకుంటున్నాడు నాగ్. దీంతో కొన్ని కథలు విన్న నాగ్.. ఓ కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఆ చిత్రం కోసం నాగచైతన్య హీరోయిన్‌ను సంప్రదించినట్లు సమాచారం. ఇంతకు నాగ్ తదుపరి చిత్రం ఏంటి..? ఎవరా హీరోయిన్..? అనుకుంటున్నారా..!

‘ఊపిరి’, ‘మహర్షి’ చిత్రాలకు పనిచేసిన సోలోమన్ అనే కో-రైటర్ ఇటీవల నాగార్జునను కలిసి ఓ కథను చెప్పాడట. అది విన్న నాగ్ వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఇందులో నాగ్ పోలీస్ పాత్రలో కనిపిస్తుండగా.. ఆయన సరసన కాజల్‌ను హీరోయిన్‌గా అనుకుంటున్నట్లు టాక్. దీనిపై ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. ఇక ఒకవేళ ఇందులో నటించేందుకు కాజల్ ఒప్పుకుంటే.. మరో రేర్ ఫీట్‌ను తన ఖాతాలో వేసుకుంటుంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీలో తండ్రీ కొడుకులైన చిరు-చెర్రీ సరసన నటించి అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్న కాజల్.. అక్కినేని ఫ్యామిలీలోనూ ఆ ఫీట్ సాధించిన హీరోయిన్‌గా నిలిచే అవకాశం ఉంది. మరి అసలే పెద్దగా ఆఫర్లు లేని సమయంలో నాగ్ పక్కన నటించేందుకు కాజల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. కాగా కాజల్, నాగ చైతన్య సరసన ఇప్పటికే దడలో కనిపించిన విషయం తెలిసిందే.

అయితే ఇక అక్కినేని ఫ్యామిలీకి సంబంధించి ఇప్పటి హీరోయిన్లలో రకుల్, లావణ్య త్రిపాఠి ఇప్పటికే ఆ రికార్డును తమ ఖాతాలో వేసుకున్నారు. వీరిద్దరు నాగార్జున, నాగ చైతన్య ఇద్దరి సరసన నటించారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu