Naga Chaitanya: నాగచైతన్య సినిమా షూటింగ్‌కు అనుమతులు రద్దు చేసిన ప్రభుత్వం.. కారణమేంటంటే..

|

Oct 10, 2022 | 8:34 AM

బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్స్‌తో ఫుల్ జోష్‌ మీదున్నాడు అక్కినేని నట వారసుడు నాగచైతన్య. లవ్‌ స్టోరీ, బంగార్రాజు వంటి సినిమాలను తన ఖాతాలో వేసుకున్న చై, థ్యాంక్యూ మూవీతో మాత్రం కాస్త ఢీలా పడ్డాడు. అయితే..

Naga Chaitanya: నాగచైతన్య సినిమా షూటింగ్‌కు అనుమతులు రద్దు చేసిన ప్రభుత్వం.. కారణమేంటంటే..
Naga Chaitanya
Follow us on

బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్స్‌తో ఫుల్ జోష్‌ మీదున్నాడు అక్కినేని నట వారసుడు నాగచైతన్య. లవ్‌ స్టోరీ, బంగార్రాజు వంటి సినిమాలను తన ఖాతాలో వేసుకున్న చై, థ్యాంక్యూ మూవీతో మాత్రం కాస్త ఢీలా పడ్డాడు. అయితే మళ్లీ ఎలాగైనా భారీ విజయాన్ని అందుకోవాలనే ఉద్దేశంతో డైరెక్టర్‌ వెంకట్‌ ప్రభుతో ఓ సినిమాలో నటిస్తున్నాడు. మాస్‌ అండ్‌ థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌ మూవీతో విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. దీంతో మేకర్స్‌ కూడా ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. నాగచైతన్య 22వ చిత్రంగా రానున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతోంది.

అయితే ఈ సినిమాకు అనుకోని ఆటంకం ఎదురైంది. సినిమా చిత్రీకరణకు బ్రేక్‌ వేస్తూ అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సినిమా షూటింగ్‌లో భాగంగా కర్ణాటకలోని మేలుకోట సమీపంలో ఆ జిల్లా అధికారుల నుంచి షూటింగ్‌కి అనుమతులు తీసుకొని చిత్రీకరణ జరపుతున్నారు. అయితే షూటింగ్‌లో భాగంగా చిత్ర యూనిట్‌ ఓ వైన్స్‌ షాప్‌కి సంబంధించి వేసిన సెట్‌పై స్థానికుల నుంచి అభ్యంతరం వ్యక్తమంది.

దీనిపై సీరిసయ్‌ అయిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు చిత్ర యూనిట్‌ నిబంధనల్ని ఉల్లంఘించారంటూ సినిమా చిత్రీకరణకు ఇచ్చిన అనుమతులు రద్దు చేశారు. దీంతో చిత్ర యూనిట్ చేసేదేమి లేక షూటింగ్‌ను నిలిపివేసింది. సదరు వైన్స్‌ షాప్‌ సెట్‌ రాజగోపురాన్ని పోలి ఉన్న కారణంగానే ప్రజలు వ్యతిరేకించినట్లు సమాచారం. అయితే దీనిపై చిత్ర యూనిట్ ఇంత వరకు అధికారికంగా స్పందించలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..