AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: హిందూ అమ్మాయి, ముస్లిం అబ్బాయి ప్రేమకథ.. OTTలో కంటతడి పెట్టించే రియల్ క్రైమ్ స్టోరీ.. తెలుగులోనూ..

ఈ వీకెండ్ లో మంచి సినిమా చూడాలనుకుంటున్నారా? అయితే ఈ లవ్ స్టోరీ కమ్ క్రైమ్ డ్రామా మీకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో టాప్ లో ట్రెండ్ అవుతోంది.

OTT Movie: హిందూ అమ్మాయి, ముస్లిం అబ్బాయి ప్రేమకథ.. OTTలో కంటతడి పెట్టించే రియల్ క్రైమ్ స్టోరీ.. తెలుగులోనూ..
OTT Movie
Basha Shek
|

Updated on: Aug 06, 2026 | 8:24 PM

Share

ఆ మధ్యన తెలుగులో రిలీజైన ‘బలగం’ సినిమా గుర్తుందా? తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా తెరకెక్కించిన ఈ సినిమా చూసి ఆడియెన్స్ బాగా ఎమోషనల్ అయ్యారు. థియేటర్లలో కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఆ తర్వాత టీవీల్లోనూ, ఓటీటీల్లోనూ ఎప్పుడూ ఈ సినిమా చూసినా బాగా ఎమోషనల్ అవుతుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. కాకపోతే ఇదొక ప్రేమకథ కమ్ క్రైమ్ థ్రిల్లర్. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. థియేటర్లలో ఈ సినిమా రిలీజైనప్పుడు ఆడియెన్స్ కన్నీళ్ల తో బయటకు వచ్చారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ మూవీకి బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. కేవలం సామాన్యులే కాదు టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా థియేటర్ కు వెళ్లి మరీ ఈ సినిమాను చూసి ప్రశంసలు కురిపించాడు. థియేటర్లలో రికార్డు కలెక్షన్లు సాధించి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా లెక్కలేనన్నీ అవార్డులు కూడా గెల్చుకుంది. ప్రస్తుతం ఓటీటీ ఆడియెన్స్ మనసులు కొల్లగొడుతోన్న ఈ సినిమా పేరు సిరాయ్ (Sirai). అంటే తమిళంలో జైలు, చెరసాల అని అర్థం.

సురేష్ రాజకుమారి తెరకెక్కించిన ఈ సినిమాలో విక్రమ్ ప్రభు ప్రధాన పాత్ర పోషించాడు. అలాగే అక్షయ్ కుమార్, అనిష్మ అనిల్ కుమార్, ఆనంద తంబిరాజాలాంటి వాళ్లు వివిధ పాత్రల్లో నటించారు. గతేడాది క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. కేవలం రూ. 3 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా 30 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తద్వారా నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చి పెట్టింది. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. ఓ హిందూ అమ్మాయిని ఓ ముస్లిం అబ్బాయి ప్రేమించడం, అనుకోకుండా అతడు ఓ హత్య కేసులో ఇరుక్కోవడం, ఐదేళ్లుగా విచారణ ఖైదీగా ఉన్న అతన్ని జైలు నుంచి కోర్టుకు ఎస్కార్టుగా తీసుకుపోయే క్రమంలో ఓ పోలీస్ అధికారి జీవితం ఎలా మారిపోయిందన్నదే ఈ సినిమా కథ. క్రైమ్ స్టోరీ అయినా ఈ సినిమాలో ఒక ఎమోషనల్ డెప్త్ లవ్ స్టోరీ ఉంది. అందుకే ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా జీ 5 ఓటీటీలో బాగా ట్రెండ్ అవుతోంది. ఒరిజినల్ తమిళ్ వెర్షన్ తో పాటు తెలుగులోనూ ఈ మూవీ అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

సిరాయ్ సినిమా ట్రైలర్ తెలుగులో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
వెంటనే బరువు తగ్గాలా?.. ఇవి తింటే కొవ్వు దానికదే మాయం!
వెంటనే బరువు తగ్గాలా?.. ఇవి తింటే కొవ్వు దానికదే మాయం!
వర్షంలో వేడి వేడిగా ఈ కరకరలాడే మష్రూమ్ పకోడీ ఉంటే చాలు..
వర్షంలో వేడి వేడిగా ఈ కరకరలాడే మష్రూమ్ పకోడీ ఉంటే చాలు..
అమెరికా వెళ్లి 500 ఎకరాల్లో కొబ్బరి తోట సాగు చేస్తున్న భారతీయుడు!
అమెరికా వెళ్లి 500 ఎకరాల్లో కొబ్బరి తోట సాగు చేస్తున్న భారతీయుడు!
NEET కొత్త పరీక్ష విధానంపై ఇంకా తుది నిర్ణయం కాలేదు.. ఇంకా చర్చలే
NEET కొత్త పరీక్ష విధానంపై ఇంకా తుది నిర్ణయం కాలేదు.. ఇంకా చర్చలే
గుడ్లు, పాల కన్నా మూడు రెట్లు ఎక్కువ.. గిన్నెడు తింటే చాలు
గుడ్లు, పాల కన్నా మూడు రెట్లు ఎక్కువ.. గిన్నెడు తింటే చాలు
హిందూ అమ్మాయి, ముస్లిం అబ్బాయి ప్రేమకథ.. OTTలో ఈ సినిమా చూశారా?
హిందూ అమ్మాయి, ముస్లిం అబ్బాయి ప్రేమకథ.. OTTలో ఈ సినిమా చూశారా?
ఓయో హోటల్స్ వ్యాపారం ఎలా..? ఎంత ఖర్చవుతుంది..?
ఓయో హోటల్స్ వ్యాపారం ఎలా..? ఎంత ఖర్చవుతుంది..?
11 మంది రూల్ లేదు.. వార్మప్ మ్యాచ్‌లో 15 మందికీ ఆడే ఛాన్స్
11 మంది రూల్ లేదు.. వార్మప్ మ్యాచ్‌లో 15 మందికీ ఆడే ఛాన్స్
కమ్మటి ఉల్లిపాయ పచ్చడి.. ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మర్చిపోలేరు!
కమ్మటి ఉల్లిపాయ పచ్చడి.. ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మర్చిపోలేరు!
‘సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర’.. 11 రోజుల్లో 7 జ్యోతిర్లింగాలు..
‘సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర’.. 11 రోజుల్లో 7 జ్యోతిర్లింగాలు..