‘మహర్షి’ మేకింగ్‌ వీడియో అదిరిపోయింది

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కెరీర్‌లో 25 చిత్రంగా వచ్చిన  ‘మహర్షి’ మంచి విజయాన్ని అందుకొని రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. తాజాగా సినిమా మేకింగ్‌ వీడియోని మూవీ యూనిట్ అభిమానుల కోసం సోషల్‌ మీడియాలో విడుదల చేసింది. షూటింగ్ కోసం గ్రామాన్ని నిర్మించడం, మహేశ్‌బాబు యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణతో పాటు మరికొన్ని షూటింగ్ టైంలో జరిగిన ఇన్సిడెంట్స్‌ను వీడియోలో చూపించారు. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా… ‘అల్లరి’ నరేశ్‌ కీలక […]

'మహర్షి’ మేకింగ్‌ వీడియో అదిరిపోయింది
Ram Naramaneni

|

May 21, 2019 | 10:58 AM


హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కెరీర్‌లో 25 చిత్రంగా వచ్చిన  ‘మహర్షి’ మంచి విజయాన్ని అందుకొని రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. తాజాగా సినిమా మేకింగ్‌ వీడియోని మూవీ యూనిట్ అభిమానుల కోసం సోషల్‌ మీడియాలో విడుదల చేసింది. షూటింగ్ కోసం గ్రామాన్ని నిర్మించడం, మహేశ్‌బాబు యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణతో పాటు మరికొన్ని షూటింగ్ టైంలో జరిగిన ఇన్సిడెంట్స్‌ను వీడియోలో చూపించారు. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా… ‘అల్లరి’ నరేశ్‌ కీలక పాత్ర పోషించారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ సినిమా, వైజయంతి మూవీస్‌ బ్యానర్లపై దిల్‌రాజు, పొట్లూరి ప్రసాద్‌, అశ్విని దత్‌ సంయుక్తంగా నిర్మించారు. విడుదలైన నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టింది.


లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu