‘సీత’ ప్రి రిలీజ్ ఈవెంట్ హైలైట్స్

కాజల్ అగర్వాల్ – బెల్లంకొండ శ్రీనివాస్ జంటగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సీత’  మే 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావ్వడానికి సన్నధం అవుతుంది. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఏకె ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. కాగా ఇటీవల ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో చిత్రబృందం మొత్తం పాల్గొంది. కాగా ఈ సందర్భంగా దర్శకుడు తేజ […]

  • Ram Naramaneni
  • Publish Date - 6:50 am, Tue, 21 May 19
'సీత' ప్రి రిలీజ్ ఈవెంట్ హైలైట్స్

కాజల్ అగర్వాల్ – బెల్లంకొండ శ్రీనివాస్ జంటగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సీత’  మే 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావ్వడానికి సన్నధం అవుతుంది. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఏకె ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. కాగా ఇటీవల ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో చిత్రబృందం మొత్తం పాల్గొంది.

కాగా ఈ సందర్భంగా దర్శకుడు తేజ మాట్లాడుతూ.. ‘సినిమాలో అందరూ చాల బాగా నటించారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారిని రెగ్యులర్‌గా కాకుండా చాలా కొత్తగా చూస్తారు. మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఇక సోనూ సూద్ గారు అయితే అద్భుతంగా నటించారు. అలాగే కాజల్ విషయానికి వస్తే.. తనతో నేను చేసిన అన్ని సినిమాలు మంచి పేరుతెచ్చాయి. అదే విధంగా ఈ సినిమాకి గుడ్ రెస్పాన్స్ వస్తుందని అనుకుంటున్నాను. ఈ సినిమాలో పనిచేసిన నటీనటులకు టెక్నీషియన్స్‌కు నేను రేటింగ్ ఇవ్వగలను..కానీ నాకు మాత్రం ఆడియెన్స్ ఇవ్వాలి. అనూప్ మంచి మ్యూజిక్ ఇచ్చారు.. మా ప్రొడ్యూసర్స్ చాల మంచివారు..వారితో సినిమా చేయడం నా అదృష్టం’ అని అన్నారు.

సోనూసూద్ మాట్లాడుతూ.. తెలుగు సినిమాల్లో నటించడం నా అదృష్టం. ఇక్కడే నేను నటనలో బేసిక్స్ నేర్చుకున్నాను. నేను ఎక్కడ నటించినా తెలుగు ఇండస్ట్రీని మర్చిపోను.. మళ్ళీ మళ్ళీ తెలుగులో నటించాలని ఉంది.. ఈ సినిమా లో నన్ను తీసుకున్నందుకు తేజ గారికి చాల థాంక్స్. నా కెరీర్ లో ఈ పాత్ర నిలిచిపోతుంది అని అన్నారు.

కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఈ సినిమా చేసినందుకు గర్వంగా ఉంది.. ఈ పాత్రకు నన్ను సెలెక్ట్ చేసిన డైరెక్టర్ తేజ గారికి చాల థాంక్స్.. ఆయనతో పనిచేయడం ఎప్పుడు కొత్తగానే ఉంది..ఆయన నాకు ఎప్పటికీ గురువుగా మిగిలిపోతారు. సీత పాత్ర నాకెంతో స్పెషల్.. అలాంటి పాత్ర మళ్ళీ చేయలేనేమో. హీరో సాయితో పనిచేయడం అమేజింగ్‌గా ఉంది.. అయన తో సినిమా కోసం డెడికేషన్‌తో పనిచేస్తారు… తప్పకుండ అందరూ ఈ సినిమా చూడండి’ అని అన్నారు.

హీరో బెల్లకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ..తేజ గారి దర్శకత్వంలో యాక్ట్ చెయ్యడం హ్యపీగా ఉందని చెప్పారు. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుదన్న నమ్మకం ఉందని తెలిపారు