AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mrunal Thakur: ఆ హీరో వల్లే నా జీవితం మారిపోయింది.. ఎమోషనల్ అయిన మృణాల్

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ లోకి అడుగుపెట్టి సక్సెస్ అయిన వారు చాలా మంది ఉన్నారు వారిలో మృణాల్ ఠాకూర్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాతోనే టాలీవుడ్ లో ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది. హనురాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం సినిమాతో ఎంట్రీ ఇచ్చి భారీ విజయాన్ని అందుకుంది.

Mrunal Thakur: ఆ హీరో వల్లే నా జీవితం మారిపోయింది.. ఎమోషనల్ అయిన మృణాల్
Mrunal
Rajeev Rayala
|

Updated on: Feb 24, 2026 | 4:41 PM

Share

అందాల భామ మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం ఆచితూచి సినిమాలు చేస్తుంది. తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ ప్రేక్షుకులను ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు. మొన్నటివరకు తెలుగులో వరుసగా సినిమాలు చేసిన మృణాల్.. ఇప్పుడు సినిమాల స్పీడ్ తగ్గించింది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ లోకి వచ్చింది మృణాల్. తెలుగులో సీతారామం సినిమాతో పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే ఈ అమ్మడు మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు.. మృణాల్ నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మృణాల్ అందానికి కుర్రాలందరూ ఫిదా అయ్యారు. ఆతర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేసింది. సీతారామం సినిమా తర్వాత వెంటనే హాయ్ నాన్న సినిమా చేసింది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.

హాయ్ నాన్న తర్వాత మృణాల్ టాలీవుడ్ లో తోప్ హీరోయిన్ అవుతుందని అంతా ఫిక్స్ అయ్యారు. రెండు సినిమాల హిట్స్ తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి సినిమా చేసింది. ఫ్యామిలీ స్టార్ అనే సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమా డిజాస్టర్ అవ్వడంతో మృణాల్ స్పీడ్ కు బ్రేకులుపడ్డాయి . ప్రభాస్ నటించిన కల్కి సినిమాలో స్పెషల్ రోల్ చేసింది. ఈ సినిమా తర్వాత ఇప్పుడు డెకాయిట్ అనే సినిమా చేస్తుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షుకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే తాజాగా మృణాల్ ఓ స్టార్ హీరో గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

ఓ హీరో చెప్పిన మాటలు తన జీవితాన్నే మార్చేశాయని తెలిపింది మృణాల్. ఆ హీరో ఎవరో కాదు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. మృణాల్ మాట్లాడుతూ.. గతంలో తన శరీరం పై వచ్చిన విమర్శలకు చాలా బాధపడ్డాను అని.. ఆ విమర్శలను తట్టుకోలేక పోయేదాన్ని  అని తెలిపింది. ఒకానొక సమయంలో బాధతో కన్నీళ్లు వచ్చేవి అని తెలిపింది. అలా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను అని తెలిపింది. ఆ సమయంలో తనకు తాను దైర్యం చెప్పుకుంటూ ముందుకు సాగాలని ఎంతో ప్రయత్నించా అని తెలిపింది మృణాల్. తన జీవితంలో అక్షయ్ కుమార్ ఇచ్చిన సలహా ఎంతో మార్పు తెచ్చిందని మృణాల్ తెలిపింది. నిన్ను నువ్వుగా అంగీకరించు. ఇతరుల మాటల కోసం మారాల్సిన అవసరం లేదు. ఒక పాత్ర కోసం అవసరమైతే మాత్రమే మార్పు చేయాలి అని అక్షయ్ చెప్పారని ఆమాటలు తన జీవితాన్ని మార్చేశాయి అని.. అప్పటినుంచి తనకు నచ్చినట్టు, సంతోషంగా బ్రతుకుతున్నా అని చెప్పుకొచ్చింది మృణాల్.

View this post on Instagram

A post shared by Akshay Kumar (@akshaykumar)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us