పవన్ హీరోయిన్‌కు షాక్.. కోర్టు నోటీసులు

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోయిన్‌కు మధ్యప్రదేశ్ కోర్టు షాక్ ఇచ్చింది. చెక్ బౌన్స్ కేసులో ఆ భామకు కోర్టు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు వచ్చే ఏడాది జనవరి 27లోపు తమ ముందు హాజరుకావాలంటూ ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ ప్రొడక్షన్ కంపెనీ నుంచి 10లక్షలు అప్పుగా తీసుకుంది బాలీవుడ్ నటి అమీషా పటేల్. దీనిని తిరిగి చెల్లించే క్రమంలో పది లక్షలకు చెక్ ఇచ్చింది. అయితే ఆ సమయంలో ఆమె బ్యాంక్ అకౌంట్‌లో సరిపడ డబ్బులు […]

పవన్ హీరోయిన్‌కు షాక్.. కోర్టు నోటీసులు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 01, 2019 | 12:50 PM

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోయిన్‌కు మధ్యప్రదేశ్ కోర్టు షాక్ ఇచ్చింది. చెక్ బౌన్స్ కేసులో ఆ భామకు కోర్టు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు వచ్చే ఏడాది జనవరి 27లోపు తమ ముందు హాజరుకావాలంటూ ఆదేశించింది.

వివరాల్లోకి వెళ్తే.. ఓ ప్రొడక్షన్ కంపెనీ నుంచి 10లక్షలు అప్పుగా తీసుకుంది బాలీవుడ్ నటి అమీషా పటేల్. దీనిని తిరిగి చెల్లించే క్రమంలో పది లక్షలకు చెక్ ఇచ్చింది. అయితే ఆ సమయంలో ఆమె బ్యాంక్ అకౌంట్‌లో సరిపడ డబ్బులు లేకపోవడంతో ఆ చెక్ బౌన్స్ అయ్యింది. దీంతో సదరు వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసును విచారించిన కోర్టు అమీషాకు నోటీసులు జారీ చేసింది.

కాగా కహోనా ప్యార్ హై అనే చిత్రం ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అమీషా పటేల్.. పవన్ కల్యాణ్ సరసన ‘బద్రి’ సినిమా ద్వారా టాలీవుడ్‌కు వచ్చింది. ఆ తరువాత మహేష్‌తో నాని, ఎన్టీఆర్‌తో నరసింహుడు, బాలయ్యతో పరమ వీర చక్ర వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటిస్తోన్న అమీషా.