AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై ‘బిగ్‌బాస్ 2’ కంటెస్టెంట్ ఫిర్యాదు

పటాన్ చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశీష్ గౌడ్‌పై బిగ్‌బాస్ 2 కంటెస్టెంట్ సంజన కేసు నమోదు చేసింది. మద్యం బాటిళ్లతో ఆశీష్ తనపై దాడికి దిగాడని ఆమె పేర్కొంది. అంతేకాకుండా బిల్డింగ్‌పై నుంచి తనను తోసేందుకు ప్రయత్నించాడని ఆమె ఆరోపించింది. హైటెక్స్ సమీపంలోని నోవాటెల్ హోటల్‌లో శనివారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగినట్లు తన ఫిర్యాదులో సంజన పేర్కొంది. రాత్రి 2 గంటల సమయంలో తన స్నేహితురాలితో కలిసి నిలబడి ఉండగా.. ఆశీష్ […]

మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై 'బిగ్‌బాస్ 2' కంటెస్టెంట్ ఫిర్యాదు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 01, 2019 | 1:53 PM

Share

పటాన్ చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశీష్ గౌడ్‌పై బిగ్‌బాస్ 2 కంటెస్టెంట్ సంజన కేసు నమోదు చేసింది. మద్యం బాటిళ్లతో ఆశీష్ తనపై దాడికి దిగాడని ఆమె పేర్కొంది. అంతేకాకుండా బిల్డింగ్‌పై నుంచి తనను తోసేందుకు ప్రయత్నించాడని ఆమె ఆరోపించింది. హైటెక్స్ సమీపంలోని నోవాటెల్ హోటల్‌లో శనివారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగినట్లు తన ఫిర్యాదులో సంజన పేర్కొంది.

రాత్రి 2 గంటల సమయంలో తన స్నేహితురాలితో కలిసి నిలబడి ఉండగా.. ఆశీష్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కొంది. ఈ సంఘటనను పలువురు చూస్తున్నా ఎవ్వరూ అడ్డుకోలేదని సంజన వాపోయింది. బౌన్సర్ల సమక్షంలోనే ఈ ఘటన జరిగిందని, వారు కూడా ఆశీష్‌ను పట్టించుకోలేదని ఆమె తెలిపింది. హోటల్ యాజమాన్యం కూడా అతడిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌లను చూస్తే నిజాలు బయటకు వస్తాయని తెలిపింది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

Follow Us
టమోటా.. కొబ్బరి అసలే వద్దు! ఇడ్లీ, దోశల్లోకి ఈ మ్యాజిక్ చట్నీ
టమోటా.. కొబ్బరి అసలే వద్దు! ఇడ్లీ, దోశల్లోకి ఈ మ్యాజిక్ చట్నీ
భారత్ ఓపెనింగ్ దరిద్రం..20 జట్లలో టీమిండియాదే చెత్త రికార్డ్
భారత్ ఓపెనింగ్ దరిద్రం..20 జట్లలో టీమిండియాదే చెత్త రికార్డ్
5 సిక్స్‌లు, 5 ఫోర్లు.. 19 బంతుల్లో విధ్వంసం
5 సిక్స్‌లు, 5 ఫోర్లు.. 19 బంతుల్లో విధ్వంసం
ప్రపంచ రికార్డు సృష్టించిన అత్యంత పెద్ద నత్త ను చూసారా ??
ప్రపంచ రికార్డు సృష్టించిన అత్యంత పెద్ద నత్త ను చూసారా ??
ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రో.. కేబినెట్ కీలక నిర్ణయం
ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రో.. కేబినెట్ కీలక నిర్ణయం
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. 5 రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు!
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. 5 రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు!
కల్తీ పాలను ఇంట్లోనే ఇలానే గుర్తించండి.! నేచురల్ చిట్కాలు ఇవిగో
కల్తీ పాలను ఇంట్లోనే ఇలానే గుర్తించండి.! నేచురల్ చిట్కాలు ఇవిగో
12 ఏళ్లకే బ్లాక్ బస్టర్ సినిమాతో సంచలనం.. 19 ఏళ్లకే మృత్యు ఒడికి
12 ఏళ్లకే బ్లాక్ బస్టర్ సినిమాతో సంచలనం.. 19 ఏళ్లకే మృత్యు ఒడికి
అసలు ఆమె త‌ల్లేనా ?? తాగిన మత్తులో 12 ఏళ్ల‌ కొడుక్కి వింత‌ శిక్ష‌
అసలు ఆమె త‌ల్లేనా ?? తాగిన మత్తులో 12 ఏళ్ల‌ కొడుక్కి వింత‌ శిక్ష‌
PAK vs ENG Preview: పాక్ జట్టుకు మరో షాక్ తగలనుందా..?
PAK vs ENG Preview: పాక్ జట్టుకు మరో షాక్ తగలనుందా..?