Maayon Telugu Movie Review – ‘మాయోన్’ రివ్యూ: మైథలాజికల్ మిస్ట్రీ.. సినిమా ఎలా ఉందంటే?

ఫస్టాఫ్ అంతా గుడిలోకి టీం ఎంట్రీ ఇవ్వడంతోనే సరిపోతుంది. కానీ, సెకండాఫ్ పూర్తిగా టెంపుల్ లోపలి రహస్యాలు తెలుసుకోడానికి హీరో టీం వెళ్లడం.. అక్కడ వాళ్ళకు కొన్ని ఊహించని పరిణామాలు ఎదురవ్వడం..చూస్తుంటే..

Maayon Telugu Movie Review - 'మాయోన్' రివ్యూ:  మైథలాజికల్ మిస్ట్రీ.. సినిమా ఎలా ఉందంటే?
Maayon Movie
Follow us

|

Updated on: Jul 08, 2022 | 7:27 AM

మూవీ రివ్యూ : మాయోన్ (Maayon) నటీనటులు : శిబి సత్యరాజ్, తాన్య రవిచంద్రన్, రాధా రవి, కే.యస్.రవికుమార్ తదితరులు సంగీతం: ఇళయరాజా ఎడిటర్: రామ్ పాండ్యన్, కొండల రావు సినిమాటోగ్రఫీ: రామ్ ప్రసాద్ నిర్మాతలు : మామిడాల శ్రీనివాస్ రచన, దర్శకత్వం: ఎన్. కిషోర్ విడుదల తేదీ: జులై 7, 2022

సత్యరాజ్ కుమార్ సిబి సత్యరాజ్ నటించిన సినిమా మాయోన్. విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగా గుడి నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా జులై 7న విడుదలైంది. మరి మయోన్ సినిమా ఎలా ఉంది..? తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకునే అంశాలు ఇందులో ఉన్నాయా..? ఇవన్నీ రివ్యూలో డీటైల్‌గా చూద్దాం..

కథ:

ఇవి కూడా చదవండి

అర్జున్ (సిబి సత్యరాజ్) ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌లో సీనియర్ అనలిస్ట్ ఆఫీసర్. పురావస్తు తవ్వకాల్లో దొరికిన వాటిని నిక్షిప్తం చేసి.. వాటి గురించి తెలుసుకోవడంలో అత్యంత నిపుణుడు అర్జున్. అలాంటి అర్జున్‌కు మాయోన్ అనే ఊళ్లో ఉన్న 5 వేల ఏళ్ల నాటి గుడి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. అందులో నిధి ఉందని.. శ్రీ కృష్ణుడు ఉన్నాడని ఊరు వాళ్లు నమ్ముతుంటారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం నుంచి ఆర్కియాలజి డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే సీనియర్ అధికారి వాసుదేవ్ (KS రవికుమార్).. అతని టీమ్‌లోని ఎపిగ్రాపిస్ట్ అంజన (తాన్య రవిచంద్రన్), మరో ఇద్దరు అక్కడికి వస్తారు. అంతా కలిసి నిధి కోసం వేట మొదలుపెడతారు. ఈ క్రమంలోనే వాళ్లకు కొన్ని నమ్మలేని నిజాలు తెలుస్తాయి. అవేంటి.. నిజంగానే అక్కడ నిధి ఉందా..? శ్రీకృష్ణుడు ఉన్నాడా అనేది అసలు కథ..

కథనం:

అనగనగా ఓ ఊరు.. ఆ ఊళ్లో వేల ఏళ్ళ నాటి గుడి.. అందులో బంగారు నిధి.. దాన్ని కనుక్కోడానికి వచ్చిన వాళ్ల వరస మరణాలు.. ఈ కథ వింటుంటే కార్తికేయ గుర్తుకొస్తుంది కదా..! కాస్త అటూ ఇటూగా ఇప్పుడు విడుదలైన మాయోన్ సినిమా కథ కూడా ఇదే. కాకపోతే రెండూ వేటికవే భిన్నమైన స్క్రీన్ ప్లేతో సాగుతాయి. మయోన్ సినిమాను చాలా ఆసక్తికరంగా మొదలుపెట్టాడు దర్శకుడు కిషోర్. అయితే అదే వేగం కొనసాగించడంలో అక్కడక్కడా తడబడ్డాడు. సినిమా ప్రారంభం నుంచి కూడా ఎక్కడా హీరోయిజానికి చోటు ఇవ్వలేదు దర్శకుడు. తానేదైతే పేపర్ మీద రాసుకున్నారో.. అదే స్క్రీన్‌పై చూపించే ప్రయత్నం చేసారు. ఈ క్రమంలోనే హీరో సిబి కూడా తన పాత్ర వరకు బాగానే చేసారు. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు బాగానే ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్‌లో గుడి గురించి చెప్పే యానిమేషన్ అవ్వొచ్చు.. హీరో చెస్ గురించి చెప్పే సీన్స్ కావచ్చు అవన్నీ బాగానే డిజైన్ చేసుకున్నారు. అయితే ఇంటర్వెల్ వరకు సీట్లలో కూర్చోబెట్టే సన్నివేశాలు మాత్రం తక్కువనే చెప్పాలి. ఫస్టాఫ్ అంతా గుడిలోకి టీం ఎంట్రీ ఇవ్వడంతోనే సరిపోతుంది. సెకండాఫ్ పూర్తిగా టెంపుల్ లోపలి రహస్యాలు తెలుసుకోడానికి హీరో టీం వెళ్లడం.. అక్కడ వాళ్ళకు కొన్ని ఊహించని పరిణామాలు ఎదురవ్వడం జరుగుతాయి. అయితే సెకండాఫ్ మొదలైన కాసేపటికే కథలోకి వెళ్లకుండా.. గుడిని కాపాడే పాము సన్నివేశాలతో పాటు గ్రాఫిక్స్ కూడా ఎక్కువ సేపు చూపించారు దర్శకుడు కిషోర్. అలా కాకుండా కథపైనే ఇంకాస్త కాన్సట్రేట్ చేసుంటే బాగుండేది అనిపించింది. గుడిలో ఏదో ఉందని చూపించడం కోసం.. అటు వైపు ప్రేక్షకుల దృష్టి మళ్లించడం కోసం ఎక్కువగా వాటిపైనే ఫోకస్ చేసారు దర్శకుడు. క్లైమాక్స్‌లో ఎప్పట్లాగే చిన్న ట్విస్ట్ ఇచ్చి కథను ముగించారు. సినిమా అంతా ప్రధానంగా దేవుడు వర్సెస్ సైన్స్ అంటూ సాగుతుంది కానీ దర్శకుడు మాత్రం ఓవైపు ఎక్కువగా ఎడ్జ్ తీసుకున్నట్లే అనిపిస్తుంది. కాకపోతే సినిమా అయిపోయాక.. చివర్లో మాత్రం దేవుడున్నాడు అని చూపించారు. కార్తికేయ చూసాం కాబట్టి మనకు ఈ కథ ఫ్రెష్‌గా అనిపించకపోవచ్చు కానీ ఉన్నంతలో బాగానే ప్రయత్నించారు.

పాజిటివ్ పాయింట్స్:

స్టోరీ ఇళయరాజా సంగీతం సిబి సత్యరాజ్

మైనస్:

రొటీన్ స్క్రీన్ ప్లే కార్తికేయను గుర్తుకు తేవడం

నటీనటులు:

సిబి సత్యరాజ్ బాగానే నటించారు. తన పాత్ర వరకు చాలా బాగా సెట్ అయ్యారు ఈయన. ఎక్కడా కమర్షియల్ హీరోయిజం చూపించడానికి ప్రయత్నించలేదు. కథలో ఉన్నంత వరకు బాగా ఇమిడిపోయారు. హీరోయిన్ తాన్య రవిచంద్రన్ అందంగా ఉన్నారు.. స్క్రీన్‌పై చాలా బాగున్నారు. మరో కీలక పాత్రలో సీనియర్ దర్శకుడు కేఎస్ రవికుమార్ అద్బుతంగా నటించారు. ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్‌గా బాగున్నారాయన. విలన్‌గా హరీష్ పేరడి నటన ఆకట్టుకుంటుంది. సీనియర్ నటుడు రాధారవి పాత్రకు సరిపోయారు. మిగిలిన వాళ్లంతా వాళ్ళ పరిధి మేరకు బాగానే నటించారు.

టెక్నికల్ టీం:

మాయోన్ సినిమాకు ప్రధాన బలం ఇళయరాజా సంగీతం. చాలా సన్నివేశాలను తన మ్యూజిక్‌తో నిలబెట్టే ప్రయత్నం చేసారు రాజా. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో వచ్చే కృష్ణుడి పాట విజువల్‌గానూ చాలా బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్‌గా ఉండాల్సింది. చాలా వరకు సన్నివేశాలు రిపీట్ అయినట్లు అనిపించాయి. ముఖ్యంగా పక్షులు, పాము ఇవన్నీ బాగా రిపీట్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. తమకున్న బడ్జెట్‌లో బాగానే చిత్రీకరించారు. దర్శకుడు కిషోర్ రాసుకున్న కథ బాగానే ఉంది కానీ స్క్రీన్ ప్లే అంత పట్టు కనిపించలేదు. ముఖ్యంగా ఈ తరహా కథ అన్నపుడు మన దగ్గర కార్తికేయ సినిమాకు పోలికలు వస్తాయి. వాటిని అందుకోవడంలో విఫలమైనా.. సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్లకు మాయోన్ పర్లేదనిపిస్తుంది.

పంచ్ లైన్: మాయోన్.. గాడ్ Vs సైన్స్.. యావరేజ్ సస్పెన్స్ థ్రిల్లర్..

Praveen Kumar, TV9 ET

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో