AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kaantha Movie Review: కాంత మూవీ రివ్యూ.. దుల్కర్ సల్మాన్ సినిమా ఎలా ఉందంటే

మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ లాంటి సినిమాల తర్వాత దుల్కర్ సల్మాన్ కు తెలుగులో మంచి మార్కెట్ వచ్చింది. దానికి తోడు రెట్రో కథలకు ఈయన పెట్టింది పేరు. ఇలాంటి సమయంలో 1950స్ నేపథ్యంలో వచ్చిన సినిమా కాంత. రానా దగ్గుపాటి నిర్మించిన ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం.

Kaantha Movie Review: కాంత మూవీ రివ్యూ.. దుల్కర్ సల్మాన్ సినిమా ఎలా ఉందంటే
Kaantha
Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: Rajeev Rayala|

Updated on: Nov 14, 2025 | 11:08 AM

Share

మూవీ రివ్యూ: కాంతా

నటీనటులు: దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే, సముద్రఖని, రానా దగ్గుపాటి తదితరులు

ఎడిటర్: ఆంటోనీ గొంసల్వేజ్

సినిమాటోగ్రాఫర్: డానీ సాంచెజ్ లోపెజ్

సంగీతం: జాను చంతార్

బ్యాగ్రౌండ్ స్కోర్: జేక్స్ బిజోయ్

నిర్మాతలు: రానా దగ్గుపాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జామ్ వర్గీస్

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సెల్వమణి సెల్వరాజ్

కథ:

అయ్య (సముద్రఖని) ఓ పెద్ద సినిమా డైరెక్టర్. అనాథ అయిన TK మహదేవన్ (దుల్కర్ సల్మాన్)ని చేరదీసి హీరోని చేస్తాడు. ఆ తర్వాత వాళ్ల జీవితంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఇద్దరు విడిపోతారు. ఆ తర్వాత మహదేవన్ పెద్ద స్టార్ అవుతాడు. తాను పరిచయం చేసిన వాడు తనకంటే ఎక్కువ ఎదిగిపోయాడని.. తనకు మర్యాద ఇవ్వడం లేదు అంటూ ఈగో పెంచుకుంటాడు అయ్యా. అదే సమయంలో తాను తన గురువుకు విధేయతతో ఉన్నా కూడా తనను తప్పుగా అర్థం చేసుకుంటున్నాడని దూరం పెడతాడు మహదేవన్. ఇద్దరి ఇగో కారణంగా శాంతా అనే సినిమా మొదలుపెట్టి ఆపేస్తారు. చాలా సంవత్సరాల తర్వాత కుమారి (భాగ్యశ్రీ బోర్సే) అనే కొత్త హీరోయిన్ వచ్చిన తర్వాత కాంత అని పేరు మార్చి మళ్లీ మొదలు పెడతారు. కానీ ఇది అయ్యకు నచ్చినట్టు కాకుండా తనకు నచ్చినట్టు చేయాలి అనుకుంటాడు మహదేవన్. ఈ క్రమంలోని నాటకీయ పరిణామాలు ఏర్పడతాయి.. మరి శాంతా సినిమా కాంతాలా మారిందా.. పూర్తయిందా లేదా.. ఈ మధ్యలో ఏం జరిగింది అనేది మిగిలిన కథ..

కథనం:

రెట్రో కథలకు దుల్కర్ సల్మాన్ కేరాఫ్ అడ్రస్ అయిపోయాడు. ఆయన సినిమాలో ఉన్నాడు అంటే కచ్చితంగా పీరియడ్ కథ ఉండాల్సిందే. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ సినిమాలు దుల్కర్ సల్మాన్ కు అలా కలిసొచ్చాయి కూడా. కానీ అన్నిసార్లు మనం పర్ఫెక్ట్ అని కాదు.. కొన్నిసార్లు తెలియకుండానే తప్పులు జరుగుతుంటాయి. దుల్కర్ సల్మాన్ కు అలా జరిగిందే కాంతా. ఆయన నుంచి వచ్చిన రేర్ మిస్టేక్ ఇది.. ఇందులోనూ పెర్ఫార్మెన్స్ పరంగా ఢోకా లేదు.. కానీ కథలోనే విషయం లేదు. చాలా నీరసంగా సాగే కథనం సహనానికి పరీక్ష.. మరీ ముఖ్యంగా ఫస్టాఫ్ మహానటి మళ్ళీ చూస్తున్నట్టే ఉంటుంది. దుల్కర్, భాగ్యశ్రీ సీన్స్ అన్నీ.. జెమిని గణేషన్, సావిత్రి సీన్స్ గుర్తుకు తెస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగున్నా.. సెకండాఫ్ కూడా అంతంత మాత్రమే. అప్పటి వరకు ఉన్న డ్రామా కాస్తా.. రానా రాగానే థ్రిల్లర్ కు షిఫ్ట్ అవుతుంది. ఒకేచోట జరగడం మూలానో ఏమో గానీ కథ కూడా అక్కడక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. గురు శిష్యుల ఇగో మీద నడిచే కథ ఇది.. కానీ దాని మీద ఎక్కువ సన్నివేశాలు రాసుకోలేదు దర్శకుడు సెల్వమణి. వాళ్లిద్దరి మధ్య దూరం పెరగడానికి సరైన రీజన్ ఇవ్వలేదు దర్శకుడు. సెకండ్ హాఫ్ లో కొన్ని మలుపులు ఉన్నా కూడా అంతగా ఆసక్తికరంగా అనిపించవు. మర్డర్ మిస్టరీ వైపు వెళ్లిన కథను ఈజీగానే గెస్ చేయొచ్చు. క్లైమాక్స్ మాత్రం బాగా రాసుకున్నాడు. ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ కారణంగా క్లైమాక్స్ బాగా హైలైట్ అయింది. అక్కడక్కడ కొన్ని మలుపులు.. వింటేజ్ లుక్ తప్పిస్తే కాంతా సినిమాలో చెప్పుకోడానికి పెద్దగా ఏమీ లేకపోవడమే మైనస్.

నటీనటులు:

TK మహదేవన్ పాత్రలో దుల్కర్ అద్భుతంగా నటించాడు.. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ లో నటన అద్భుతం. భాగ్యశ్రీ బోర్సే కూడా బాగా నటించింది. రానా దగ్గుబాటి క్యారెక్టర్ ఎంటర్టైనింగ్ గా ఉంది. సముద్రఖని నటన ఆకట్టుకుంది. మిగిలిన వాళ్ళందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు..

టెక్నికల్ టీం:

పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. నాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపించారు. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉండాల్సిందే. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. దర్శకుడిగా సెల్వమణి సెల్వరాజ్ పాయింట్ బాగా రాసుకున్నాడు కానీ దాన్ని ఇంకాస్త గ్రిప్పింగ్ గా చెప్పి ఉంటే బాగుండేది. ఇందులో మేజర్ ప్లస్ పాయింట్ ఆర్ట్ డిపార్ట్మెంట్.

పంచ్ లైన్:

ఓవరాల్ గా కాంతా.. సినిమాలో సినిమా అంతగా ఆకట్టుకోలేదు..!