సంక్రాంతికి ముగిస్తున్నాము.. ఉగాదికి మొదలెడదాము

వైవిధ్య దర్శకుడు మోహన్‌కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కిస్తోన్న చిత్రం వి. సుధీర్ బాబు హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో నాని నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు. నివేథా థామస్, అదితీరావు హైదారీ హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. ఈ మూవీ గతేడాది సెట్స్ మీదకు వెళ్లగా.. ఈ రోజుతో చిత్రీకరణ ముగియనుంది. ఈ విషయాన్ని నాని తన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. వి మూవీ షూటింగ్‌కు ఇవాళ చివరి రోజు అని చెప్పిన నాని.. ‘‘సంక్రాంతి రోజు ముగిస్తున్నాము. […]

  • Tv9 Telugu
  • Publish Date - 4:51 pm, Wed, 15 January 20
సంక్రాంతికి ముగిస్తున్నాము.. ఉగాదికి మొదలెడదాము

వైవిధ్య దర్శకుడు మోహన్‌కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కిస్తోన్న చిత్రం వి. సుధీర్ బాబు హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో నాని నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు. నివేథా థామస్, అదితీరావు హైదారీ హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. ఈ మూవీ గతేడాది సెట్స్ మీదకు వెళ్లగా.. ఈ రోజుతో చిత్రీకరణ ముగియనుంది. ఈ విషయాన్ని నాని తన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. వి మూవీ షూటింగ్‌కు ఇవాళ చివరి రోజు అని చెప్పిన నాని.. ‘‘సంక్రాంతి రోజు ముగిస్తున్నాము. ఉగాదికి మొదలెడదాము’’ అంటూ కామెంట్ పెట్టారు. కాగా దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సైరా ఫేమ్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తుండగా.. ఉగాది కానుకగా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.