మెగాస్టార్ చిరంజీవి మూవీ టైటిల్‌తో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అంటున్నారే..

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారువారి పాట సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అందాల భామ కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.

  • Rajeev Rayala
  • Publish Date - 7:42 pm, Fri, 11 December 20
మెగాస్టార్ చిరంజీవి మూవీ టైటిల్‌తో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అంటున్నారే..

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారువారి పాట సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అందాల భామ కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమా తరవాత మహేష్ ఎవరితో సినిమా చేస్తాడన్నదాని పైన క్లారిటీ లేదు.

నిజానికి మహేష్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా చెయ్యాల్సి ఉంది. కానీ జక్కనతో సినిమా అంటే మినిమం 2 ఏళ్ళు పట్టుద్ది. దాంతో మహేష్ వంశీ పైడిపల్లితో సినిమా చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఇటీవల వంశీ చెప్పిన స్టోరీ నచ్చడంతో మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. పూర్తిగా ఎంటర్టైన్మెంట్ యాంగిల్ లో సాగే ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి మూవీ టైటిల్ ను అనుకుంటున్నారట. చిరు సూపర్ హిట్ ‘స్టేట్ రౌడీ’  టైటిల్ తో మహేష్ సినిమా రాబోతుందని జోరుగా ప్రచారం సాగుతుంది. మహేష్ సినిమాకు మెగాస్టార్ టైటిల్ అనే వార్త ఇప్పుడు అభిమానులలో ఆసక్తిగా మారింది. మరో వైపు మహేష్ తో సినిమా చేయడానికి పూరి, సుకుమార్, త్రివిక్రమ్ కూడా సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది.