RC 15: నా కలను రామ్‌చరణ్ నిజం చేశాడు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మెగాస్టార్ చిరంజీవి.
Ram Charan Shankar Movie: రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.,,

Ram Charan Shankar Movie: రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో చెర్రీ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. ఈ చిత్రంలో శ్రీకాంత్, సునీల, అంజలి, నవీన్ చంద్ర వంటి పలువురు స్టార్ యాక్టర్స్ నటిస్తున్నారు. ఈ సినిమాపై అటు తమిళ ఇండస్ట్రీతో పాటు తెలుగులోనూ భారీ అంచనాలున్నాయి. శంకర్ దర్శకత్వం వహిస్తున్న తొలి తెలుగు హీరోగా రామ్ చరణ్ అరుదైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా బుధవారం ఈ సినిమాను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి రాజమౌళితో పాటు బాలీవుడ్ హీరో రన్‌బీర్ కపూర్ చిరంజీవి హాజరయ్యారు.
ఈ సందర్భంగా తొలి సన్నివేశానికి రణ్‌వీర్ సింగ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, చిరంజీవి క్లాప్ ఇచ్చి, సినిమా స్క్రిప్ట్‌ను శంకర్‌కు అందించారు. ఇక ఈ సందర్భంగా మెగా స్టార్ చిరంజీవి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్ని ప్రాజెక్టులు ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంటాయని అలాంటి వాటిలో ఈ సినిమా ఒకటని వ్యాఖ్యానించారు. శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలన్నది తన కల అని చెప్పిన చిరు.. అది రామ్‌చరణ్ ద్వారా నిజం కావడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇక హీరో రామ్ చరణ్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. అందరికీ మరిచిపోలేని ఒక మంచి సినిమాను ఇవ్వనున్నాం అని చెప్పుకొచ్చారు.
We are coming !!!#RC15 #SVC50 Muhurtham Ceremony Today. @shankarshanmugh @AlwaysRamCharan@advani_kiara @MusicThaman @DOP_Tirru @ramjowrites @saimadhav_burra @SVC_official pic.twitter.com/VnwUtmPaXP
— Sri Venkateswara Creations (@SVC_official) September 8, 2021
ఇదిలా ఉంటే చిత్ర షూటింగ్ సందర్భంగా యూనిట్ విడుదల చేసిన పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ పోస్టర్‌ను గమనిస్తే.. రామ్ చరణ్ ఇందులో ఏదో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి చెందిన అధికారిలా కనిపిస్తున్నారు. మరి ఈ సినిమా కథాంశం ఏంటో తెలియాలంటే మరో అప్‌డేట్ వచ్చే వరకు వేచి చూడాలి.
Also Read: SP Balasubrahmanyam: దుబాయ్ షేక్ నోట బాలసుబ్రహ్మణ్యం పాట.. పొల్లుపోకుండా పాడి ఫిదా చేశాడుగా..
Tollywood Drugs Case: టాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసు.. ఈరోజు ఈడీ ముందుకు రవితేజ..
Arvind Swami : అందుకే ‘తలైవి’ సినిమా ఒప్పుకున్నా.. ఆసక్తికర విషయాలు తెలిపిన అరవింద స్వామి..