Manchu VIshnu: గాలి నాగేశ్వరరావుగా విష్ణు.. స్వాతిగా పాయల్‌ రాజ్‌పుత్‌.. కొత్త సినిమా మొదలు పెట్టిన ప్రెసిడెంట్‌..

Manchu VIshnu: 2021లో వచ్చిన 'మోసగాళ్లు' తర్వాత మళ్లీ తెరపై కనిపించలేదు మంచు విష్ణు. అయితే సినిమాల ద్వారా ప్రేక్షకులకు చేరువకాకపోయిన మా అధ్యక్ష ఎన్నికల (MAA Elections) నేపథ్యంలో నిత్యం వార్తల్లో నిలిచారు. ఇదిలా ఉంటే తాజాగా విష్ణు మళ్లీ..

Manchu VIshnu: గాలి నాగేశ్వరరావుగా విష్ణు.. స్వాతిగా పాయల్‌ రాజ్‌పుత్‌.. కొత్త సినిమా మొదలు పెట్టిన ప్రెసిడెంట్‌..
Vishnu Manchu

Updated on: Mar 06, 2022 | 7:00 AM

Manchu VIshnu: 2021లో వచ్చిన ‘మోసగాళ్లు’ తర్వాత మళ్లీ తెరపై కనిపించలేదు మంచు విష్ణు. అయితే సినిమాల ద్వారా ప్రేక్షకులకు చేరువకాకపోయిన మా అధ్యక్ష ఎన్నికల (MAA Elections) నేపథ్యంలో నిత్యం వార్తల్లో నిలిచారు. ఇదిలా ఉంటే తాజాగా విష్ణు మళ్లీ సినిమాల్లో బిజీగా మారేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా విష్ణు కొత్త సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ విషయాన్ని విష్ణు అధికారికంగా ప్రకటించారు. కొత్త సినిమా టైటిల్ ప్రకటించకపోయినప్పటికీ తన పాత్రను పరిచయం చేశారు.

ఈషాన్‌ సూర్య దర్శకత్వం వహిస్తున్న సినిమాలో విష్ణు గాలి నాగేశ్వరరావు అనే పాత్రలో నటిస్తున్నారు. కార్టూన్‌ రూపంలో గీసిన పాత్రను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ.. తన కొత్త పాత్రను పరిచయం చేశారు. పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు విష్ణు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో విష్ణుకు జోడిగా అందాల తార పాయల్‌ రాజ్‌పుత్ నటిస్తోంది. పాయల్‌ ఈ సినిమాలో స్వాతి పాత్రలో నటించనుంది. తన పాత్రకు సంబంధించిన కార్టూన్‌ ఫోటోను పోస్ట్‌ చేసిన పాయల్‌.. ‘మంచు విష్ణుతో నా కొత్త సినిమా ప్రారంభం కానుంది. సూపర్‌ ఎగ్జైటింగ్‌తో ఉన్నాను. పూర్తి వివరాలు త్వరలోనే’ అని రాసుకొచ్చింది.

ఇక ఈ సినిమాపై చిత్రం బృందం మాట్లాడుతూ.. విష్ణు తన కెరీర్‌లో ఇప్పటి వరకు చేయని సరికొత్త పాత్రలో నటిస్తున్నారని తెలిపింది. ఈ కొత్త సినిమాకు కెమెరా మెన్‌గా ఛోటా.కె. నాయుడు, అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానికి డైరెక్టర్‌ జి. నాగేశ్వరరెడ్డి మూలకథ అందించగా, భాను, నందు డైలాగ్స్‌ రాస్తున్నారు.

Also Read: Beard Itching: గడ్డం దురదగా ఉంటుందా.. మీరు ఈ తప్పులు చేస్తున్నారని అర్థం..!

Taliban leader: తాలిబన్ల బరితెగింపు! తొలి సారిగా బయటికొచ్చిన తాలిబన్ల నాయకుడి ఫొటో.. మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌!

ఈ బుడతడు మామూలోడు కాదు !! రెండేళ్ల వయసులోనే పైలట్‌గా !! వీడియో