AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మ పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ… అత్త పాత్ర‌లో విజ‌య‌శాంతి 

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు 25వ చిత్రం `మ‌హ‌ర్షి` ఈ నెల 9న విడుద‌ల‌కానున్న సంగ‌తి విదితమే. ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్ చేయ‌బోయే సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. మ‌హేష్ హీరోగా న‌టిస్తున్న 26వ చిత్ర‌మిది. ఈ ఏడాది `ఎఫ్ 2`తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నాడు. తాజా స‌మాచారం ప్ర‌కారం మ‌హేష్‌కు ర‌మ్య‌కృష్ణ అమ్మ పాత్ర‌లో, విజ‌య‌శాంతి అత్త పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారట‌. పాత్ర‌ల […]

అమ్మ పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ... అత్త పాత్ర‌లో విజ‌య‌శాంతి 
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 04, 2019 | 3:12 PM

Share

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు 25వ చిత్రం `మ‌హ‌ర్షి` ఈ నెల 9న విడుద‌ల‌కానున్న సంగ‌తి విదితమే. ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్ చేయ‌బోయే సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. మ‌హేష్ హీరోగా న‌టిస్తున్న 26వ చిత్ర‌మిది. ఈ ఏడాది `ఎఫ్ 2`తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నాడు. తాజా స‌మాచారం ప్ర‌కారం మ‌హేష్‌కు ర‌మ్య‌కృష్ణ అమ్మ పాత్ర‌లో, విజ‌య‌శాంతి అత్త పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారట‌. పాత్ర‌ల ప‌రిధి, ప్రాముఖ్య‌త‌ను అనుస‌రించి ఈ సీనియ‌ర్ హీరోయిన్లను ఆ పాత్ర‌ల‌కు ఎంచుకున్నార‌ని టాక్‌. ఈ చిత్రానికి `స‌రిలేరు నీకెవ్వ‌రూ` అనే టైటిల్ పరిశీల‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. జూన్ నుండి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌నుంది.