‘మహర్షి’ సెన్సార్ పూర్తి.. రన్‌టైం ఎంతంటే.!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో తెరకెక్కిన చిత్రం ‘మహర్షి’. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుని మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఒక్క కట్ లేకుండా యూ/ఏ సర్టిఫికెట్ పొందింది. అలాగే ఈ సినిమా యొక్క రన్‌టైంను 175 నిమిషాలుగా ఫిక్స్ చేశారట. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ ముఖ్య […]

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో తెరకెక్కిన చిత్రం ‘మహర్షి’. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుని మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఒక్క కట్ లేకుండా యూ/ఏ సర్టిఫికెట్ పొందింది. అలాగే ఈ సినిమా యొక్క రన్‌టైంను 175 నిమిషాలుగా ఫిక్స్ చేశారట.
పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో హీరో మహేష్ మూడు విభిన్న షేడ్స్‌లో కనిపించనున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పివిపి, దిల్ రాజు, అశ్వినీదత్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
It’s U/A with no cuts. Join the journey of Rishi from May 9th. https://t.co/fCsftX3RjB@urstrulyMahesh @directorvamshi @hegdepooja @allarinaresh @ThisisDSP @KUMohanan1 @Cinemainmygenes @ShreeLyricist #SSMB25 #Maharshi pic.twitter.com/5VGAnaUeQ5
— Sri Venkateswara Creations (@SVC_official) May 3, 2019




