AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏఏ 20 మూవీ లాంచ్ ఎప్పుడంటే..?

‘రంగస్థలం’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన దర్శకుడు సుకుమార్ తన తదుపరి చిత్రాన్ని అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని మే 11న లాంచ్ చేయనున్నారని తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే.. సుకుమార్ డైరెక్షన్‌లో బన్నీ నటించడం ఇది మూడోసారి. ఇంతకుముందు ఆర్య, ఆర్య 2 చిత్రాలు వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కాయి. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ […]

ఏఏ 20 మూవీ లాంచ్ ఎప్పుడంటే..?
Ravi Kiran
|

Updated on: May 04, 2019 | 4:52 PM

Share

‘రంగస్థలం’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన దర్శకుడు సుకుమార్ తన తదుపరి చిత్రాన్ని అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని మే 11న లాంచ్ చేయనున్నారని తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే.. సుకుమార్ డైరెక్షన్‌లో బన్నీ నటించడం ఇది మూడోసారి. ఇంతకుముందు ఆర్య, ఆర్య 2 చిత్రాలు వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కాయి. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని బన్నీ.. త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమా పూర్తి కాగానే సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడట.