Mahesh Babu: మహేష్ మూవీ ఆగిపోవడానికి నాగ్ డైరక్టర్ కారణమా..!
మహేష్-వంశీ పైడిపల్లి సినిమా ఆగిపోయిందన్న వార్త ఇటీవల ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోన్న విషయం తెలిసిందే. దీంతో సూపర్‌స్టార్ ఫ్యాన్స్ షాక్‌కు గురవ్వగా.. దీనిపై ఇటు మహేష్ గానీ, అటు వంశీ పైడిపల్లి గానీ ఇప్పటికీ స్పందించకపోవడంతో ఇదే నిజమేనని వారు భావిస్తున్నారు.
మహేష్-వంశీ పైడిపల్లి సినిమా ఆగిపోయిందన్న వార్త ఇటీవల ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోన్న విషయం తెలిసిందే. దీంతో సూపర్‌స్టార్ ఫ్యాన్స్ షాక్‌కు గురవ్వగా.. దీనిపై ఇటు మహేష్ గానీ, అటు వంశీ పైడిపల్లి గానీ ఇప్పటికీ స్పందించకపోవడంతో ఇదే నిజమేనని వారు భావిస్తున్నారు. అయితే మహేష్‌కు బెస్ట్ ఫ్రెండ్ అయిన వంశీ ప్రాజెక్ట్‌ను హోల్డ్‌లో పెట్టడంపై ఫిలింనగర్‌లో పలు రకాల పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. స్క్రిప్ట్ పూర్తి చేయకపోవడంతోనే ప్రాజెక్ట్‌ను మహేష్ పక్కనపెట్టినట్లు.. ఫైనల్ స్క్రిప్ట్ మహేష్‌కు నచ్చకపోవడంతోనే ఈ మూవీ ఆగిపోయినట్లు ఇలా పలు రకాల వార్తలు వస్తున్నాయి. వీటితో పాటు తాజాగా మరో రూమర్ టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఈ ప్రాజెక్ట్ ఆగిపోవడానికి నాగార్జున డైరక్టర్ కారణమట. ఇంతకు అతనెవరంటే..! అశిషోర్ సోలోమన్.
సోలోమన్ ప్రస్తుతం నాగార్జునతో ‘వైల్డ్ డాగ్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ కూడా ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది. అయితే డైరక్టర్‌గా మారకముందు సోలోమన్, వంశీ పైడిపల్లి వద్ద సహాయ రచయితగా పనిచేశారు. వంశీ తెరకెక్కించిన ఊపిరి, మహర్షి చిత్రాల విజయాల్లో సోలమన్ పాత్ర ఎక్కువగా ఉన్నట్లు టాక్. ఇక అతడు దర్శకుడిగా వెళ్లిన తరువాత.. ఇప్పుడు స్క్రిప్ట్‌ను తయారు చేసుకునే పని మొత్తం వంశీపైనే పడింది. దీంతో వంశీ స్క్రిప్ట్‌ను సరిగా తయారుచేయలేకపోయారని, ఇక ఫైనల్ స్క్రిప్ట్ మహేష్‌కు నచ్చలేదని తెలుస్తోంది. కాగా సోలమన్ కంటే ముందు వంశీ పైడిపల్లి సినిమాలకు కొరటాల శివ రచయితగా పనిచేసిన విషయం తెలిసిందే.
Read This Story Also: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. మహేష్ ఏం జరుగుతోంది..!