Thalaivi : ‘తలైవి’లో శశికళగా ఆ హీరోయిన్..!
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతోన్న మూవీ 'తలైవి'. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషిస్తుండగా.. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. విష్ణువర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్. సింగ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
Thalaivi : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతోన్న మూవీ ‘తలైవి’. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషిస్తుండగా.. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. విష్ణువర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్. సింగ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అయితే జయలలిత ఇష్టసఖి శశికళ పాత్రలో ఎవరు నటిస్తున్నారనే విషయం షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మిస్టరీగా మారింది. తాజాగా ఈ విషయంపై స్పష్టత వచ్చింది.
తలైవి చివరి రోజుల వరకు ఆమె వెన్నంటి ఉన్న శశికళ పాత్రలో సౌత్ ఇండియా హీరోయిన్.. ‘సీమటపాకాయ్’, ‘అవును’ సినిమాలతో మంచి ఫేమ్ సంపాదించిన పూర్ణను కన్ఫామ్ చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఆమె షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఇక దివంగత నటుడు యంజీ రామచంద్రన్ పాత్రలో అరవింద స్వామి, హీరో శోభన్‌బాబుగా బెంగాలీ నటుడు జిష్షూ సేన్ గుప్తా, యంజీఆర్ భార్య జానకి పాత్రలో మధుబాల కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. సినిమాను జూన్‌లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
ఇది కూడా చదవండి : మహేశ్ నెక్ట్స్ మూవీ ఆయన డైరెక్షన్‌లో..!