AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu : మహేశ్ నెక్ట్స్ మూవీ ఆయన డైరెక్షన్‌లో..!

'మహేశ్​ 27' మూవీ ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ఇటీవలే 'సరిలేరు నీకెవ్వరు' మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు మోహమాటాలకు పోయి మూటగట్టుకున్న ప్లాపుల విషయంలో మహేశ్ కొత్త పాఠాన్ని నేర్చుకున్నట్టు తెలుస్తోంది.

Mahesh Babu : మహేశ్ నెక్ట్స్ మూవీ ఆయన డైరెక్షన్‌లో..!
Ram Naramaneni
|

Updated on: Feb 25, 2020 | 3:38 PM

Share

Mahesh Babu : ‘మహేశ్​ 27’వ మూవీ ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ఇటీవలే ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు మోహమాటాలకు పోయి మూటగట్టుకున్న ప్లాపుల విషయంలో మహేశ్ కొత్త పాఠాన్ని నేర్చుకున్నట్టు తెలుస్తోంది. సరిలేరు తర్వాత వంశీ పైడిపల్లి డైరక్షన్‌లో ఆయన మూవీ ఉంటుందని ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే అన్ని పరిణామాలు చకచకా జరిగిపోయాయి. అయితే లైన్ చెప్పి ఎగ్జైట్ చేసిన వంశీ..పూర్తి స్క్రిప్ట్‌తో మెస్మరైజ్ చేయలేకపోయాడట. అందుకే బెస్ట్ ప్రెండ్ అయినప్పటికి వంశీ పైడిపల్లి మూవీ పక్కన పెట్టాడు మహేశ్. కొంతటైమ్ తీసుకోని స్క్రిప్ట్‌కి మెరుగులు దిద్దిన అనంతరం ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది.

ఈ గ్యాప్‌లో మరో మూవీవైపు మహేశ్ మనసు మళ్లినట్టు తెలుస్తోంది.  ‘చందమామ కథలు’, ‘గుంటూరు టాకీస్’ ‘గరుడవేగ’ చిత్రాలను తెరకెక్కించిన​ ప్రవీణ్‌ సత్తారు ఓ కథ వినిపించాడని, అది థ్రిల్లింగ్‌గా అనిపించడంతో మహేశ్​ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాలీవుడ్​ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కాగా అతి త్వరలోనే ఈ ఊహాగానాలకు తెరపడే అవకాశం కనిపిస్తుంది. ‘సరిలేరు నీకెవ్వరు’ హిట్ అనంతరం విదేశాలకు వెళ్లిన మహేశ్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పటికే మూవీ రిలీజై 40 రోజులు దాటిన నేపథ్యంలో..మరో 10 రోజుల్లోనే ఆయన తదుపరి మూవీపై ప్రకటన ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్