Ram Charan : చరణ్ నెక్ట్స్ మూవీకి డైరెక్టర్ అతడేనా..!
Ram Charan : ప్రస్తుతం జక్కన్న చెక్కుతోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. ఈ మూవీ తర్వాత నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవరితో ఉంటుందా అని ఫ్యాన్స్ తెగ చర్చించుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది దర్శకులు చెర్రీ దగ్గరికి భారీ స్క్రిప్ట్స్‌తో వెళ్లారు. కానీ ఏది కూడా చరణ్‌ను అంత ఎగ్జైట్ చెయ్యలేదట. కానీ ఇటీవల గ్యాంగ్ లీడర్ చిత్రంతో ఓ మోస్తారు విజయాన్ని అందుకున్న విక్రమ్ కె. కుమార్.. […]
Ram Charan : ప్రస్తుతం జక్కన్న చెక్కుతోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. ఈ మూవీ తర్వాత నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవరితో ఉంటుందా అని ఫ్యాన్స్ తెగ చర్చించుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది దర్శకులు చెర్రీ దగ్గరికి భారీ స్క్రిప్ట్స్‌తో వెళ్లారు. కానీ ఏది కూడా చరణ్‌ను అంత ఎగ్జైట్ చెయ్యలేదట. కానీ ఇటీవల గ్యాంగ్ లీడర్ చిత్రంతో ఓ మోస్తారు విజయాన్ని అందుకున్న విక్రమ్ కె. కుమార్.. మెగా పవర్‌స్టార్‌కు ఓ కథ వినిపించాడని ఫిల్మ్ సర్కిల్ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అతడి దర్శకత్వంలో చరణ్ నటించేందుకు చరణ్ మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది.
కథలోని ఓ టర్నింగ్ పాయింట్ చెర్రీకి విపరీతంగా నచ్చిందట. దీంతో స్టోరీని ఇంకాస్త డెవలప్ చేసి రావల్సిందిగా మెగా పవర్ స్టార్..విక్రమ్‌కి చెప్పినట్టు సమాచారం. ‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత దాదాపు ఇతడి దర్శకత్వంలోనే మూవీ ఖరారు కావొచ్చని ఫిల్మ్ వర్గాల బోగట్టా. మరి ఈ వార్తలు ఎంతవరకు నిజమో తెలియాలంటే అఫిషియల్ అనౌన్సిమెంట్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.