Karthika Deepam: రూమర్లపై క్లారిటీ.. వంటలక్క ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..

తెలుగులో అత్యంత ఆదరణ పొందుతున్న సీరియల్స్‌లో కార్తీక దీపం టాప్ ప్లేస్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సీరియల్ గురించి ఓ షాకింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వంటలక్క స్థానంలో మరో నటిని తీసుకురాబోతున్నారని...

Karthika Deepam: రూమర్లపై క్లారిటీ.. వంటలక్క ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 27, 2020 | 9:33 AM

Karthika Deepam Serial: టీవీ సీరియల్స్ అంటే మహిళలే, కాదు ఇప్పుడు పురుషులు కూడా అత్యంత ఆసక్తి చూపుతున్నారు. తెలుగులో అత్యంత ఆదరణ పొందుతున్న సీరియల్స్‌లో కార్తీక దీపం టాప్ ప్లేస్‌లో ఉంది. అత్యధిక టీఆర్పీ రేటింగ్స్ సాధిస్తూ బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సీరియల్‌లో దీప క్యారెక్టర్ చాలా ప్రత్యేకం. ఆమె క్యారెక్టర్ కోసమే చాలామంది మహిళలు ఈ సీరియల్ చూస్తున్నారు అని చెప్పొచ్చు.

Also Read: Polluted India:కాలుష్య భూతం కోరల్లో ఇండియా.. టాప్ ప్లేస్‌లో 21 నగరాలు..!

రేపటి ఎపిసోడ్ కోసం ముందురోజు నుంచే అతృతగా ఎదురు చూసేలా చేస్తుంది అంటే ఈ సీరియల్‌ ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతేకాకుండా దీపగా, వంటలక్కగా నటి ప్రేమి విశ్వనాథ్ ప్రతీ మహిళను కదిలించే విధంగా నటించింది. ఆమె నటనే సీరియల్‌కు ప్రధాన ఆకర్షణ.

జాతీయ స్థాయిలో టాప్ ప్లేస్ దక్కించుకున్న ఈ ‘కార్తీకదీపం’కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. దీపక్క దెబ్బకు స్టార్ హీరోల సినిమాల సైతం సైడ్ అయిపోవాల్సిందే. మహర్షి, ఇస్మార్ట్ శంకర్ లాంటి కొత్త చిత్రాలను టీవీల్లో ప్రసారం చేసినా.. ‘కార్తీకదీపం’ సీరియల్ టీఆర్పీల ముందు అవన్నీ తేలిపోతాయి. అయితే తాజాగా ఈ సీరియల్ గురించి ఓ షాకింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: FSSAI New Rule: కాలం చెల్లిన స్వీట్లకు ఇక చెల్లు.. జూన్ 1 నుంచి కొత్త రూల్..

వంటలక్క స్థానంలో మరో నటిని తీసుకురాబోతున్నారని ఓ రూమర్ బుల్లితెర వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. సుమారు 739 ఎపిసోడ్‌లు పూర్తి చేసుకుని కీలక దశకు చేరుకున్న ఈ సీరియల్‌లో లీడ్ రోల్‌ను మార్చడం ఏంటని ఫ్యాన్స్ తలలు పట్టుకున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఈ సీరియల్ స్టార్టింగ్‌లో తక్కువ పారితోషికానికి నటి ప్రేమి విశ్వనాధ్ ఒప్పుకున్నారట. అయితే క్రమేపి ‘కార్తీకదీపం’ అంచనాలకు మించి క్రేజ్ సంపాదిస్తూ జాతీయ స్థాయిలో టాప్ ప్లేస్‌కు చేరుకోవడంతో ఆమె రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోవడంతో… రెమ్యునరేషన్‌ను కూడా నిర్వాహకులు నాలుగు రెట్లు పైగా పెంచారని సమాచారం. అయితే తాజాగా దీప(ప్రేమి విశ్వనాధ్)కు వేరే సీరియల్స్ నుంచి భారీ ఆఫర్లు వస్తుండటంతో రెమ్యునరేషన్‌ను భారీగా డిమాండ్ చేస్తున్నారని వినికిడి.

ఈ రూమర్ వైరల్ కావడంతో దీప ప్లేస్‌లో వేరొక నటిని ఊహించుకోలేమని.. కార్తీకదీపం అంటే వంటలక్క.. వంటలక్క అంటే కార్తీకదీపం అని ఫ్యాన్స్‌ నుంచి పూర్తి వ్యతిరేకత వచ్చినట్లు సమాచారం. ఇక దీనిపై యూనిట్ స్పందిస్తూ అవన్నీ వట్టి పుకార్లు మాత్రమేనని కొట్టిపారేశారు. సో వంటలక్క ఫ్యాన్స్‌ ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.