Polluted India: కాలుష్య భూతం కోరల్లో ఇండియా.. టాప్ ప్లేస్‌లో 21 నగరాలు..!

దేశ రాజధాని ఢిల్లీనే కాదు.. దక్షిణ, ఈశాన్య, పడమరల్లో ఉన్న నగరాలకు కూడా కాలుష్య భూతం మరింత విస్తరిస్తోంది.అంతేకాక వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2019 ప్రకారం ప్రపంచంలో కల్లా అధిక వాయు కాలుష్యం ఉన్న టాప్ 30 నగరాల్లో మనవే 70 శాతం ఉండటం గమనార్హం. 

Polluted India: కాలుష్య భూతం కోరల్లో ఇండియా.. టాప్ ప్లేస్‌లో 21 నగరాలు..!
Follow us

|

Updated on: Feb 26, 2020 | 2:52 PM

Polluted India:  దేశ రాజధాని ఢిల్లీనే కాదు.. దక్షిణ, ఈశాన్య, పడమరల్లో ఉన్న నగరాలకు కూడా కాలుష్య భూతం మరింత విస్తరిస్తోంది. సిటీల్లో పెరుగుతున్న జనాభా.. అదే విధంగా ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న వాహనాల సంఖ్య కారణంగా వాయు కాలుష్యం పలు మెట్రోపాలిటన్ సిటీల్లో ప్రమాదకర స్థాయికి చేరుకుంది. 2019-20 సంవత్సరాన్ని ఒకసారి పరిశీలిస్తే.. దేశవ్యాప్తంగా పొల్యూషన్ శాతం తారాస్థాయికి పెరిగిందని నివేదికలు సూచిస్తున్నాయి. అంతేకాక వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2019 ప్రకారం ప్రపంచంలో కల్లా అధిక వాయు కాలుష్యం ఉన్న టాప్ 30 నగరాల్లో మనవే 70 శాతం ఉండటం గమనార్హం.

Also Read: జగనన్న విద్యాదీవెన కార్డుపై సూపర్ స్టార్ ఫోటో.. ఏంటా కథ.?

టాప్ ప్లేస్‌లో ఘజియాబాద్.. ఆరో స్థానంలో ఢిల్లీ..

వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2019.. గ్లోబల్ పొల్యూషన్ డేటా పోర్టల్ ఆధారంగా ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ నగరం అగ్రస్థానంలో నిలిచింది. అక్కడ వాయు కాలుష్యం ఉండాల్సిన పాయింట్ల కంటే అధికంగా ఉన్నట్లు నివేదిక చెబుతోంది. ఆ తర్వాత చైనాలోని హోటన్ సిటీ రెండో ప్లేస్‌లో ఉండగా.. భారత రాజధాని ఢిల్లీ ఆరో స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా కాలుష్యంతో నిండి ఉన్న 30 నగరాల లిస్ట్‌లో ఇండియాకు సంబంధించి 21 సిటీస్ కూడా ఉన్నాయి.

Also Read: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాజధాని ప్రాంతంలో అర్హులకు ఇళ్ల స్థలాలు!

ఇక టాప్ 10 కాలుష్యంతో కూడిన నగరాల్లో ఆరు మన దేశ రాజధాని పరిసరాల్లోనివి కావడం షాక్ కలిగిస్తున్న అంశం. నోయిడా, గురుగ్రామ్, గ్రేటర్ నోయిడా, బంధావారిలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఢిల్లీ అత్యధిక పొల్యూషన్ కలిగిన రాజధానిగా రిపోర్ట్ పేర్కొంది.

మరోవైపు ఈ వాయు కాలుష్యంతో నిండి ఉన్న నగరాల జాబితాలో ఇండియా, చైనా దేశాలు పోటీ పడుతున్నాయి. సుమారు అత్యధిక స్థానాల్లో ఈ రెండు దేశాలకు సంబంధించిన నగరాలే ఉన్నాయి. టాప్ 200 లిస్టులో సుమారు 178 నగరాలు ఈ రెండు దేశాలకు చెందినవే. ఏది ఏమైనా భారతదేశంలోవాయుకాలుష్యం రోజురోజుకూ తారాస్థాయికి చేరుకుంటోంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని నియంత్రించడానికి చర్యలు చేపడుతున్నా ప్రయోజనం మాత్రం శూన్యం.

Latest Articles
అమావాస్య రోజున ఈ పనులు చేయవద్దు.. లేకపోతే ఆర్ధిక ఇబ్బందులు తప్పవు
అమావాస్య రోజున ఈ పనులు చేయవద్దు.. లేకపోతే ఆర్ధిక ఇబ్బందులు తప్పవు
సిటీ వద్దు.. శివారే ముద్దు.. జనాల్లో మార్పునకు కారణమిదేనా..
సిటీ వద్దు.. శివారే ముద్దు.. జనాల్లో మార్పునకు కారణమిదేనా..
హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
మీ ఫోన్లో ఈ రెండు యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి..
మీ ఫోన్లో ఈ రెండు యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి..
Horoscope Today: ఆ రాశి వారు సహోద్యోగులతో జాగ్రత్తగా మెలగండి..
Horoscope Today: ఆ రాశి వారు సహోద్యోగులతో జాగ్రత్తగా మెలగండి..
ప్రధాని మోడీని కలిసిన పీవీ నరసింహరావు కుటుంబ సభ్యులు.. కారణమిదే
ప్రధాని మోడీని కలిసిన పీవీ నరసింహరావు కుటుంబ సభ్యులు.. కారణమిదే
సంజూ శాంసన్ పోరాటం వృథా.. రాజస్థాన్‌పై ఢిల్లీ విజయం
సంజూ శాంసన్ పోరాటం వృథా.. రాజస్థాన్‌పై ఢిల్లీ విజయం
ప్రేమలో ఆ ఇద్దరూ నన్ను మోసం చేశారు.? షాహిద్ కపూర్ వీడియో.
ప్రేమలో ఆ ఇద్దరూ నన్ను మోసం చేశారు.? షాహిద్ కపూర్ వీడియో.
తోటి నటులే హీరోయిన్‌ను చంపి.. తల నరికిన దారుణ ఘటన..!
తోటి నటులే హీరోయిన్‌ను చంపి.. తల నరికిన దారుణ ఘటన..!
OTTలో గీతాంజలి.. ఆ రోజు రాత్రి 12 గంటల నుంచి స్ట్రీమింగ్.
OTTలో గీతాంజలి.. ఆ రోజు రాత్రి 12 గంటల నుంచి స్ట్రీమింగ్.