Breaking News
  • కొంతమంది కరోనాను ఓ మతానికి అంటగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో మనకు కావాల్సింది మతం కాదు.. మానవత్వం. కరోనాపై యుద్ధం చేస్తూనే.. రైతు సంక్షేమం కోసం కృషిచేస్తున్నాం. మనమంతా స్వీయ నియంత్రణ పాటించాలి-టీవీ9తో మంత్రి హరీష్‌రావు.
  • రాజస్థాన్‌లో మరో ఐదు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు. రాజస్థాన్‌లో ఇప్పటివరకు 348కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు.
  • ఏపీలో కొత్తగా 15 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు. ఏపీలో ఇప్పటి వరకు 329కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు. కర్నూలులో 74, నెల్లూరులో 49, గుంటూరులో 41 కేసులు నమోదు. కృష్ణాలో 35, కడపలో 28, ప్రకాశంలో 24, ప.గోలో 21 కేసులు నమోదు. చిత్తూరులో 20, విశాఖలో 20, తూ.గోలో 11, అనంతపురంలో 6 కేసులు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో నమోదుకాని ఒక్క పాజిటివ్‌ కేసు.
  • కృష్ణా: పామర్రులో అడిషనల్‌ ఎస్పీ మోకా సత్తిబాబు తనిఖీలు. లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించని 17 దుకాణాలపై కేసు నమోదు. సరైన కారణాలు చెప్పకపోవడంతో రెండు కార్లు సీజ్‌ చేసిన పోలీసులు.
  • అమరావతి: ఉ.11:15కి కరోనాపై సీఎం జగన్‌ సమీక్ష. కోవిడ్‌-19 పరీక్షా పరికరాలను జగన్‌కు అందించనున్న మంత్రి మేకపాటి. ఏపీలో తయారైన తొలి కోవిడ్-19టెస్టింగ్ కిట్‌ను ప్రారంభించనున్న సీఎం. పరిశ్రమలశాఖ తరపున 10 వేల లీటర్ల శానిటైజర్లను.. సీఎం జగన్‌కు అందించనున్న మంత్రి మేకపాటి గౌతంరెడ్డి. మ.ఒంటి గంటకు నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ సహా.. పలువురు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులతో మేకపాటి వీడియో కాన్ఫరెన్స్‌. మ.2 గంటలకు కొత్త పారిశ్రామిక విధానంపై అధికారులతో మేకపాటి సమీక్ష. మ.3.30కి సిమెంట్‌ సేకరణ వెబ్‌సైట్‌ను ప్రారంభించనున్న సీఎం జగన్‌. మ.3.35కు కొత్త పారిశ్రామిక విధానంపై సీఎం జగన్‌ సమీక్ష.

YS Jagan: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాజధాని ప్రాంతంలో అర్హులకు ఇళ్ల స్థలాలు!

కృష్ణా, గుంటూరు జిల్లాలోని అర్హులకు జగన్ సర్కార్ శుభవార్త అందించింది. 'పేదలందరికీ ఇళ్లు' కార్యక్రమంలో భాగంగా ఆయా ప్రాంతాల్లోని అర్హులైన పేదవారికి ఇళ్ల స్థలాలను మంజూరు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది...
YS Jagan Sarkar, YS Jagan: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాజధాని ప్రాంతంలో అర్హులకు ఇళ్ల స్థలాలు!

YS Jagan Sarkar: కృష్ణా, గుంటూరు జిల్లాలోని అర్హులకు జగన్ సర్కార్ శుభవార్త అందించింది. ‘పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా ఆయా ప్రాంతాల్లోని అర్హులైన పేదవారికి ఇళ్ల స్థలాలను మంజూరు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. దీని నిమిత్తం సీఆర్డీఏ పరిధిలోని తాడేపల్లి, పెదకాకాని, మంగళగిరి, దుగ్గిరాల మండలాలతో పాటు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో అర్హులకు భూములను కేటాయించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మొత్తం 54,307 మంది లబ్దిదారులకు 1251.5 ఎకరాలు ఇవ్వనున్నట్లు జీవోలో పేర్కొంది. కాగా, నౌలూరు, కృష్ణాయపాలెం, నిడమర్రు, ఐనవోలు, కురగల్లు, మందడంలో భూములను అర్హులకు ఇవ్వనున్నారు.

Also Read: జగనన్న విద్యాదీవెన కార్డుపై సూపర్ స్టార్ ఫోటో.. ఏంటా కథ.?

Also Read: Polluted India:కాలుష్య భూతం కోరల్లో ఇండియా.. టాప్ ప్లేస్‌లో 21 నగరాలు..!

YS Jagan Sarkar, YS Jagan: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాజధాని ప్రాంతంలో అర్హులకు ఇళ్ల స్థలాలు! YS Jagan Sarkar, YS Jagan: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాజధాని ప్రాంతంలో అర్హులకు ఇళ్ల స్థలాలు! YS Jagan Sarkar, YS Jagan: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాజధాని ప్రాంతంలో అర్హులకు ఇళ్ల స్థలాలు!

Related Tags