నాలుగు రోజుల షూటింగ్ తరువాత తీసేశారు.. రాత్రంతా ఏడ్చేదాన్ని

1991లో అళగన్‌ అనే మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మధుబాల త్వరగానే గుర్తింపును తెచ్చుకున్నారు.

నాలుగు రోజుల షూటింగ్ తరువాత తీసేశారు.. రాత్రంతా ఏడ్చేదాన్ని
Follow us

| Edited By:

Updated on: Aug 26, 2020 | 7:38 PM

Madhubala on her first movie: 1991లో అళగన్‌ అనే మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మధుబాల త్వరగానే గుర్తింపును తెచ్చుకున్నారు. ఇక మణిరత్నం తెరకెక్కించిన రోజా చిత్రం ద్వారా ఆమె పాపులారిటీ మరింత పెరిగింది. అయితే కెరీర్ ప్రారంభంలో ఆమె చాలా ఇబ్బందులనే ఎదుర్కొన్నారట. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

”మొదట్లో నేను ఓ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికయ్యాను. నాలుగు రోజుల పాటు నాపై సన్నివేశాలను తెరకెక్కించారు. అయితే ఆ తరువాత నన్ను తీసేశారు. కనీసం ఆ విషయాన్ని కూడా వారు నాకు చెప్పలేదు. ఇది నాపై చాలా ప్రభావం చూపించింది. దీని వలన రోజు రాత్రి నా బెడ్‌రూమ్‌లో ఏడ్చేదాన్ని. కానీ పొద్దున్నే నేను కాలేజీకి వెళ్లేదాన్ని. మా నాన్న, సోదరుడు, స్నేహితులతో మాట్లాడుతూ సమయం గడిచిపోయింది. అప్పుడు నేను డిప్రెషన్‌లో ఉండే విషయం కూడా నాకు తెలీదు” మధుబాల అన్నారు. ”నిజానికి చెప్పాలంటే నన్ను ఆ సినిమా నుంచి ఎందుకు తీసేశారన్న విషయం కూడా దర్శకనిర్మాతలు చెప్పలేదు. అదే పెద్ద బాధ అనిపించింది. నా స్థానంలో వేరే హీరోయిన్‌ని తీసుకున్నారన్న విషయాన్ని న్యూస్ పేపర్ చదివి తెలుసుకున్నా” అని వెల్లడించారు. ”అయినా ఇలా జరగడమే మంచిదేమో. ఆ సంఘటన తరువాత నేను చాలా కష్టపడ్డాను. ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాను” అని మధుబాల తెలిపారు.

Read More:

బంపరాఫర్లు పెట్టిన యజమాని.. షాప్‌ ఓపెనింగ్ రోజే సీజ్‌

ఏపీ ప్రభుత్వం కీలక అనుమతులు.. టీటీడీ ఆధీనంలోకి 7 దేవాలయాలు