అందాల రాక్షసి సినిమాతో సినిమాల్లోకి వచ్చిన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. ఆతర్వాత ఈ సొట్టబుగ్గల సుందరి మంచి అవకాశాలను దక్కించుకుంటూ దూసుకుపోతుంది. నాని నటించిన భలే భలే మగాడివోయ్, నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయన వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది లావణ్య. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా లావణ్య అవకాశాలను అందుకుంటుంది. అలాగే సినిమాలతో పాటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ భామ. ఈ వయ్యారికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఈ వయ్యారి ట్విట్టర్ వేదికగా ‘వరల్డ్ డాన్స్ డే’ సందర్బంగా ఓ డాన్స్ వీడియో షేర్ చేసింది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది.
ఇక లావణ్య ఇటీవలే సందీప్ కిషన్ నటించిన ఏ1 ఎక్స్ ప్రెస్, కార్తికేయ తో కలిసి చావు కబురు చల్లగా వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రెండు సినిమాలు కూడా లావణ్యకు హిట్టు అందించలేకపోయాయి. ప్రస్తుతం లావణ్య త్రిపాఠి ఓ తమిళ్ సినిమాలో నటిస్తుందని తెలుస్తుంది. అలాగే తెలుగు లోను ఓ సినిమా సైన్ చేసిందని టాక్.
లావణ్య డ్యాన్స్ వీడియో ..
Beautiful @Itslavanya treats y’all to a small packet of fun on this #WorldDanceDay#Lavanya #LavanyaTripati #InternationalDanceDay2021 pic.twitter.com/RaDTMkHbxH
— BARaju (@baraju_SuperHit) April 29, 2021
మరిన్ని ఇక్కడ చదవండి :