వేట కొడవలితో భీకరంగా ధనుష్ : ‘అసురన్’ పోస్టర్

కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా వస్తున్న చిత్రం ‘అసురన్’. ఈ సినిమాను మారి-2 సినిమా డైరెక్టర్ వెట్రిమరన్ తెరకెక్కిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇది మూడో సినిమా. కాగా.. ఈ సినిమా వెక్కై అనే నవల ఆధారంగా రూపొందుతున్నట్లు సమాచారం. జనవరిలోనే ఈ సినిమా షూటింగ్ మొదలైయింది. ఈ సినిమాలో మలయాళ భామ మంజూ వారియర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పలు పోస్టర్స్ విడుదల చేసిన చిత్ర యూనిట్.. తాజాగా మరో పోస్టర్‌ని రిలీజ్ […]

  • Tv9 Telugu
  • Publish Date - 10:27 am, Tue, 30 April 19
వేట కొడవలితో భీకరంగా ధనుష్ : 'అసురన్' పోస్టర్

కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా వస్తున్న చిత్రం ‘అసురన్’. ఈ సినిమాను మారి-2 సినిమా డైరెక్టర్ వెట్రిమరన్ తెరకెక్కిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇది మూడో సినిమా. కాగా.. ఈ సినిమా వెక్కై అనే నవల ఆధారంగా రూపొందుతున్నట్లు సమాచారం. జనవరిలోనే ఈ సినిమా షూటింగ్ మొదలైయింది. ఈ సినిమాలో మలయాళ భామ మంజూ వారియర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పలు పోస్టర్స్ విడుదల చేసిన చిత్ర యూనిట్.. తాజాగా మరో పోస్టర్‌ని రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌ తమిళ నేటివిటీ ఉట్టిపడేలా కనిపిస్తోంది. చేతిలో పొడవాటి వేట కొడవలితో ధనుష్ భీకరంగా కనిపిస్తోన్న ఈ లుక్ అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. జీవీ ప్ర‌కాశ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.