భవానీ సహా ఇంటి సభ్యులందరూ డిన్నర్ కోసం డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తారు. అప్పుడు భవానీ ఇంటి బాధ్యతలు తీసుకున్న తర్వాత ముకుందలో మార్పు వచ్చింది. బాధ్యత గా ఉంటుంది అని భవానీ పొగుడుతుంటే.. రేవతి అవును స్పీడ్ పెంచింది కదా అని అంటుంది.. అంటే అంటున్న భవానీతో హుషారుగా ఉంటుంది అనబోయి.. స్పీడ్ పెంచింది అన్నాను. అంటే.. రేవతి పిన్ని వంటల కంటే ఎవరూ బాగా చేయలేరు అని అంటాడు మధు. కృష్ణకు కళ్లు మూసుకుని వంటలు పేర్లు చెప్పమంటే.. ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసిన కృష్ణ వాసన చూసి చకచకా వంటల పేర్లు చెప్పేస్తుంది. నేను వడ్డిస్తానంటూ ముకుంద.. మురారీ నీకు గుత్తివంకాయ అంటే ఇష్టం కదా.. అందుకే చేశాను.. అంటే.. ఇక్కడ ఉన్నవన్నీ ఏసీపీ సార్ కు ఇష్టమైనవే కదా అంటుంది కృష్ణ. అన్నీ మురారీకి ఇష్టమైనవి చేసావా ముకుందా అని ప్రసాద్ అడిగితే… రేవతి నోటీసు బోర్డు తగిలించి ఎవరికీ ఇష్టమైనవి వారిని అడిగి వండి పెడతారు సరేనా అని అంటుంది రేవతి. ప్రసాద్ తో మీకు ఏమి ఇష్టమైన వో చెప్పండి అవే చేస్తానని అంటుంది ముకుంద. భలే నటిస్తున్నావు ముకుంద అని కృష్ణ అనుకుంటుంది. రేవతి వడ్డిస్తా అంటే.. నేను వడ్డించుకుంటా మిగతా వాళ్ళకి వడ్డించు అంటుంది.
అలేఖ్య కావాలనే మురారీకి అన్నీ ఇష్టమైనవి చేసింది.. భార్యలా మురారీకి ఎలా సేవ చేస్తుందో చూడు అంటే.. నాకు కళ్లు లేవా నోరుముసుకుని తిను అంటూ అలేఖ్యని మధు తిడతాడు. మురారీ నీకు పప్పులో అప్పడాలు ఇష్టం కదా తిను అంటే.. మరి నాకు ఎప్పుడూ చెప్పలేదే అని కృష్ణ మురారీని నిలదీస్తుంది. ఇష్టాలు చెప్పారు కృష్ణ.. ఇష్టమైనవారి కోసం తెలుసుకోవాలి అంతే అని ముకుంద అన్న మాటతో అందరూ షాక్ అవుతారు. భవానీ ఏమి మాట్లాడుతున్నావు ముకుంద అని అంటే.. మురారీ నా ఫ్రెండ్ కదా మేము ఒకసారి కలిసి లంచ్ చేసినప్పుడు తన ఇష్టాలు చెప్పాడని ముకుంద చెబుతుంది. ముకుంద స్పీడ్ చూస్తుంటే ఈ కొంప కూడా కుంపటిలా అనిపిస్తుందని అలేఖ్య అనుకుంటుంటే.. ఇంకా ఏసీపీ సార్ కు ఏమేమి ఇష్టం ముకుంద అని అని అడిగిన కృష్ణకు.. ఫిష్ ప్రై .. మటన్ పాయా అంటూ లిస్ట్ చాకచకా చెప్పేస్తుంది. మురారీకి పొలమారితే.. నీళ్లు ఇవ్వడానికి ముకుంద, కృష్ణ ట్రై చేస్తారు. అప్పుడు నీరు మురారీ మీద పడుతుంది.
మురారీ నా ఫ్రెండ్.. అంటే ఆదర్శ్ నా ప్రాణ స్నేహితుడు కదా అంటే నాకు కూడా ఫ్రెండ్ కదా.. అంటే.. ఏసీపీ సార్ కు నేను వడ్డిస్తా.. అందరికీ నువ్వు వడ్డించు అని అంటుంది కృష్ణ.. చినమామయ్యకు అప్పడం వడ్డించు అని కృష్ణ అంటే.. ముకుంద కావాలంటే తీసుకోండి అంటుంది కానీ అక్కడ నుంచి కదలదు. రేవతి, కృష్ణ లు ముకుంద ప్రవర్తనకు చిరాకు పడుతుంటారు. ముకుంద చూశావా అత్తయ్య.. నా మురారీకి నేనే సేవ చేసుకుంటున్నా అని ముకుంద తనతో తాను హ్యాపీ ఫీల్ అవుతుంది.
ముకుంద మీద కృష్ణకు అనుమానం వచ్చిందా.. లేక నిజం తెలిసిందా అడగాలి కృష్ణను అనుకుంటుంది రేవతి. ఇంతలో కృష్ణ.. ఎంత దూరం పంపించాలని చూసినా వెళ్లడం లేదు.. అనవసరంగా నాతో పెట్టుకుంటున్నావు ముకుంద అని కృష్ణ అనుకుంటే.. నన్ను గెలవడం నీ తరం కాదు కృష్ణ ని ముకుంద అనుకుంటుంది.
కృష్ణ పదే మురారితో ముకుంద చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అందరి ముందే ముకుంద ఏసీపీ సార్ కు భార్యలా సేవలు చేస్తుదని. ముకుంద ఆదర్శ్ పేరు చెప్పి.. సేవల చేస్తుంది. ఏసీపీ సార్ ఇండైరెక్ట్ గా ముకుంద విషయం చెప్పాలని చూస్తున్నారు.. ఇప్పడు నేను ఏమి చెయ్యాలి.. తన మనసులో లేనని.. ఇంట్లో నుంచి వెళ్లిపోవాలా.. ఎందుకు తీసుకొచ్చారని అత్తయ్యని నిలదీయాలా అని కృష్ణ తనలో తాను మదన పడుతూ ఉంటుంది. కృష్ణ ఎందుకు అలా వున్నావు.. చెప్పాల్సిందే అని మధు అడిగితే.. కృష్ణ మందుమీద విసుక్కుంటుంది. మురారీ కృష్ణ ఎందుకు అదోలా ఉంటుంది.. ఇందాక ముకుంద మాటల వల్ల కృష్ణ ఇబ్బంది పడినట్లు అనిపించింది అనుకుంటుంటే ఇంతలో ఫోన్ వస్తుంది. రోజూ ఈవిడ టార్చర్ తట్టుకోలేకపోతున్నాను దేవుడా అని మురారీ ఫీల్ అవుతాడు..
కృష్ణ నీ బాధ ఏమిటో చెప్పు అని మధు అంటే.. కృష్ణ ఏడుస్తూ అవును మధు.. నాకు చాలా బాధగా ఉంది. ఈ ఇంట్లో నా స్తానం ఏమిటో అర్ధం కాకా.. ఏమి చెయ్యాలో తెలియక చచ్చిపోవాలన్నతం బాధగా ఉంది అని కృష్ణ మధు చెప్పి కన్నీరు పెట్టుకుంటుంది. నువ్వు తీరుస్తావా తీర్చలేవు కదా.. తన బాధ కూడా ముకుంద గురించి అయ్యి ఉంటుంది అంటే.. మధు ముకుంద నీకు ఏమైనా వార్నింగ్ ఇచ్చిందా.. నీ బాధకు కారణం ముకుందనేనా అని మధు కృష్ణను అడుగుతాడు. అంటే నీకు చెబుతాను అన్నీ నీకు వివరంగా చెబుతాను ఇక్కడ కాదు నాతో రా అని కృష్ణను అక్కడ నుంచి తీసుకుని వెళ్తాడు. మురారీకి కూడా కృష్ణకు ముకుంద విషయం తెలిసి ఉంటుందని నిర్ణయానికి వస్తాడు.
ముకుంద ఫోన్ చేస్తే.. ముకుందకు గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి అనుకుంటుంటే.. మురారీ నీతో మాట్లాడాలి ఒకసారి పైకి రా అంటుంది.. వస్తున్నా ముకుంద నీతో చాలా మాట్లాడాలి వస్తున్నా అనుకుంటూ.. ఫస్ట్ ముకుంద సంగతి తేలుద్దాం అనుకుంటూ మురారీ వెళ్తాడు.
తన దగ్గరకు వచ్చిన మురారితో లవ్ యు మురారీ అని అంటే.. నేను ఎప్పుడో నిన్ను లవ్ చేయడం మానేశా అంటే.. కానీ నేను నిన్ను జీవితాంతం లవ్ చేస్తూనే ఉంటాను అని అంటుంది ముకుంద. మురారి..ముకుంద ప్రేమల గురించి కృష్ణకు చెప్పిన మధు.. ఆదర్శ్ వచ్చే వరకూ ముకుందని కంట్రోల్ చెయ్యడం ఎవరి వల్లా కాదు నువ్వే బుద్ధి చెల్లని తేల్చిన మధు. మళ్ళీ కృష్ణ అనుమానంతో మధు అయినా నిజం చెబుతున్నాడా.. లేదా రేవతి అత్తయ్యలాగే నేను బాధపడకూడదని అబద్ధం చెబుతున్నాడా అని కృష్ణ ఆలోచిస్తుంది. ఏదైనా నిజం నేరుగా చూసి.. నమ్మేవరకూ ఇంట్లో ఎవరిని నమ్మను.. అనుకుంటూనే.. నువ్వు చెప్పేది నిజం అయితే ముకుందని నేను సెట్ చేస్తానని కృష్ణ చెప్పడంతో మధు రిలీఫ్ ఫీల్ అవుతాడు.
ముకుంద దగ్గరకు వచ్చిన మురారీ.. అసలు నీ ప్రాబ్లెమ్ ఏమిటి ముకుంద.. నా ఫ్రెండ్ భార్యవని ఊరుకుంటూ ఉంటే తెగ రెచ్చిపోతున్నావు. ఏమి చేసినా వీడు ఏమి చెయ్యలేడు అనుకుంటున్నావా.. ఇప్పటికే నీకు చాలా సార్లు చెప్పాను.. ఇప్పుడూ చెబుతున్నా.. నీ లిమిట్స్ లో నువ్వు ఉండు.. అప్పుడు అందరికీ మంచిది.. నీకు పరిచయం అయినప్పుడు మురారీ వేరు.. ఇప్పటి మురారీ వేరు. ఇప్పుడన్నీ మారిపోయాయి.. నా ఇష్టాలన్నీ నేను కృష్ణ కోసం మార్చుకున్నాను.. తనకు నచ్చేలా ఎంత కష్టమైనా మారతాను.. నీ సేవలు అన్నీ ఆదర్శ్ కు చూపించి నాకు కాదు.. ఇది రిక్వెస్ట్ కాదు.. వార్నింగ్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అంటే.. అయిపోయిందా నేను మాట్లాడొచ్చా అసలు నీ ప్రాబ్లెమ్ ఏమిటి ఎందుకు వచ్చి నామీద అరుస్తున్నావు.. అవును రా నేను నిన్నే ప్రేమిస్తా అందరి ముందే నీకు భార్యలా సేవలు చేస్తా ఏమి చేస్తావు కొడతా కొట్టు.. పర్లేదు మురారీ కొట్టు.. అంటుంటే.. కృష్ణ కు సుమలత మురారీ ఎక్కడ ఉన్నాడో చెబుతుంది. అంటే ముకుంద కూడా అక్కడే ఉంటుందని అని వెళుతుంది.
నువ్వు నన్ను మోసం చేసి నీ మనసులో నీ జీవితంలో నాకు తప్ప వేరే ఎవరికీ చోటు ఉందని మాట ఇచ్చి మళ్ళీ నాకు అన్యాయం చేశావు అని మురారీని నిలదీస్తుంది ముకుంద. ఇప్పుడొచ్చి ఇచ్చిన మాట నిలబెట్టుకోరా అని అంటే నామీద అరుస్తావేంట్రా అని ముకుంద అంటుంది.. అసలు కృష్ణను వదిలెయ్యడానికి నీకు ప్రాబ్లెమ్ ఏమిటి అని ముకుంద ప్రశ్నిస్తుంది.. ఇదంతా చాటుగా కృష్ణ వింటుంది..
అవును ముకుంద నేనే మాట ఇచ్చాను నేను మాట తప్పను.. నేనే మోసం చేశాను ఒప్పుకుంటున్నాను.. ఒకప్పుడు నేను నిన్ను ప్రేమించిన మాట వాస్తవమే కాదనను.. నీ కోసం నా గుండెల్లో గుడి కట్టుకున్నా.. కానీ ముకుంద నిన్ను సూటిగా ఒక ప్రశ్న అడుగుతా నీ గుండెల మీద చెయ్యి వేసుకుని నిజం చెబుతావా అని అంటే.. చెబుతా అంటుంది ముకుంద.. మన కాదనే మరో వెర్షన్ చెబుతా అని అంటాడు మురారీ.. నీకు ఒక అక్కో చెల్లిలో ఉంటే నేను ఖర్మ కాలి పెళ్లి చేసుకుని ఉంటే ఇలాగే మా మధ్యలో దూరిపోయేదానివా అని అడుగుతాడు మురారీ.. ఇప్పడూ కృష్ణను నన్ను వేరు చేయాలి అని చూస్తున్నట్లే.. అప్పుడు మీ అక్కని నన్ను వేరు చేసేదానివా అసలు నువ్వు ఏమి చేసేదానివి అని ముకుందని ప్రశ్నిస్తాడు.
నువ్వు ఇంక మారవు.. చావనైనా చస్తాను కానీ నా ప్రాణ స్నేహితుడి భార్యవి నిన్ను ప్రేమించలేను.. నా మనసులో ఎప్పటికీ కృష్ణే ఉంటుంది ముకుంద అని చెబుతాడు.. అది విన్న ఆనందంలో కృష్ణ..
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..