Vijay Antony: బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోని కూతురు ఆత్మహత్య.. విషాదంలో కుటుంబసభ్యులు
బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన విజయ్ ఆంటోని కూతురు ఆత్మహత్య చేసుకున్నారు. విజయ్ ఆంటోని కూతురు మీరా ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మీరా 12 వ తరగతి చదువుతోంది. ఆత్మహత్యకు పాల్పడిందని తెలిసిన వెంటనే దగ్గర్లోనియూ కావేరి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు తెలుస్తోంది. మీరా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన విజయ్ ఆంటోని కూతురు ఆత్మహత్య చేసుకున్నారు. విజయ్ ఆంటోని కూతురు మీరా ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మీరా 12 వ తరగతి చదువుతోంది. ఆత్మహత్యకు పాల్పడిందని తెలిసిన వెంటనే దగ్గర్లోనియూ కావేరి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు తెలుస్తోంది. మీరా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మీరా ఆత్మహత్యకు కారణం ఏంటా అని దర్యాప్తు చేస్తున్నారు.
విజయ ఆంటోని మ్యూజిక్ డైరెక్టర్ గా చాలా సినిమాలకు సంగీతం అందించారు. అలాగే సింగర్ గాను తన ప్రతిభ చాటారు. ఇక బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు విజయ్ ఆంటోని అంతకు ముందు పలు సినిమాలతో తెలుగులో అలరించారు. రీసెంట్ గా బిచ్చగాడు 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. విజయ్ ఆంటోనీ ఫాతిమాను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒకేఒక్క కూతురు మీరా. మీరా ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవడంతో విజయ్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.