Bharathi Raja: అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన దిగ్గజ దర్శకుడు.. త్వరగా కోలుకోవాలంటూ అభిమానుల ప్రార్థనలు

ప్రము కోలీవుడ్ దర్శక దిగ్గజం, నటుడు, నిర్మాత భారతీ రాజా అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పితో ఆయన చెన్నైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చేరినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, రెండు రోజులు వైద్యుల సంరక్షణలో ఉంచాలని వైద్యులు చెప్పారు

Bharathi Raja: అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన దిగ్గజ దర్శకుడు.. త్వరగా కోలుకోవాలంటూ అభిమానుల ప్రార్థనలు
Bharathi Raja

Edited By:

Updated on: Aug 27, 2022 | 8:06 AM

ప్రము కోలీవుడ్ దర్శక దిగ్గజం, నటుడు, నిర్మాత భారతీ రాజా అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పితో ఆయన చెన్నైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చేరినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, రెండు రోజులు వైద్యుల సంరక్షణలో ఉంచాలని వైద్యులు చెప్పారు. కాగా కొన్ని నెలలుగా వరుసగా సినిమాల్లో నటిస్తోన్న భారతీ రాజా మధురై ఎయిర్‌పోర్టులో ఉన్నట్లుండి స్పృహ తప్పి పడిపోయారు. ఆయన్ను గమనించిన సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని అజీర్ణం కారణంగా స్పృహ తప్పి పడిపోయాడని తెలిపారు. విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందన్నారు.

కాగా ’16 వయత్తినిలే’ (తెలుగులో పదహారేళ్ల వయసు)తో సినీ ఇండస్ట్రీలోకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు భారతీ రాజా. ఆ తర్వాత కొత్త జీవితాలు, సీతాకోక చిలుక, ఆరాధన, జమదగ్ని తదితర కల్ట్‌ క్లాసిక్‌ చిత్రాలతో దిగ్గజ దర్శకునిగా పేరు తెచ్చుకున్నారు. దర్శకుడిగా బ్రేక్‌ తీసుకున్న తర్వాత నటుడిగానూ సత్తా చాటుతున్నారు. ఇటీవలే ధనుష్, నిత్యామేనన్‌, రాశీఖన్నా నటించిన తిరు చిత్రంలో ఈ దిగ్గజ దర్శకుడు ఓ కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. కాగా భారతీ రాజా ఆస్పత్రిలో చేరారని తెలుసుకున్న అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.