ప్రముఖ తమిళ్ హీరో కవిన్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నాడు. కవిన్ లేటెస్ట్ మువీ ‘దాదా’ బ్లాక్‌బాస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. తన యాక్టింగ్‌తో ప్రేక్షకులను అలరించిన ఈ యంగ్ హీరో త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన ప్రేయసి మోనికతో కలిసి ఆగస్టు 20న ఏడడుగులు నడవనున్నాడు. వీరి వివాహం వేడుక కుటుంబాలు, బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరగనుంది. చెన్నైలోనే వీరి విహాహ వేడుక జరగనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కవిన్ పెళ్లి చేసుకోబోతున్నాడన్న విషయం తెలిసిన అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఐతే నటుడు కవిన్ మాత్రం ఇంత వరకూ తన పెళ్లి వార్తలను అధికారికంగా ప్రకటించలేదు. ఇక కవిన్ గార్ల్ ఫ్రెండ్ మోనికా గురించి చెప్పాలంటే ఆమె ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది. కాగా కవిన్ ‘కనా కానమ్ కలలాంగల్’ అనే టీవీ సీరియల్‌తో కవిన్ కెరీర్ ప్రారంభించాడు. ఈ సీరియల్‌లో కవిన్ నటన ప్రేక్షకులను మెప్పించాడు. ఆ తర్వాత శరవణన్ మీనాక్షి, తాయుమానవన్ వంటి సీరియల్స్‌లోనే నటించాడు.
Wedding bells for @Kavin_m_0431!
Young Tamil star Kavin, whose latest film #Dada emerged a blockbuster earlier this year, is to tie the knot with his longtime girlfriend #Monica on August 20. The wedding is to take place with the blessings of both families.#Kavin pic.twitter.com/kKsLUQ8jME— Yuvraaj (@proyuvraaj) August 1, 2023
2017లో విడుదలైన ‘సత్రియాన్’ చిత్రంలో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలో కనించాడు. తన రెండో మువీ ‘నాట్పున్న ఎన్ననాను తెరియుమా’ చిత్రంతో మొదటి సారి హీరోగా మారాడు. ఐతే ఈ ఏడాది విడుదలైన ‘దాదా’తో కవిన్ సూపర్ హిట్ కొట్టడంతో పాపులర్ అయ్యాడు. సీరియల్స్, సినిమాలతోపాటు తమిళ బిగ్‌బాస్ 3 సీజన్‌లోనూ కవిన్ కంటెస్ట్‌గా ఉన్నాడు. ఆ షోలో మరో కంటెస్టెంట్ లాస్లియాతో ప్రేమాయణం నడిపాడు. తాము రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు లాస్లియా కూడా ధృవీకరించింది. కొన్నాళ్లకు వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.