AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : పెళ్లిళ్లలో రూ.50 జీతానికి వెయిటర్‌గా పనిచేసి.. ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.. ?

సినీరంగంలో నటీనటులుగా వెలగడం అంత సులభమైన విషయం కాదు. ఎన్నో సవాళ్లు, విమర్శలు దాటుకుని వచ్చి తమకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న తారలు చాలా మంది ఉన్నారు. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ ఒకరు. ఒకప్పుడు పెళ్లిల్లో వెయిటర్ గా వర్క్ చేసింది. ఆ తర్వాత ఇండస్ట్రీని ఏలేసింది.

Tollywood : పెళ్లిళ్లలో రూ.50 జీతానికి వెయిటర్‌గా పనిచేసి.. ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.. ?
Rakhi Sawant
Rajitha Chanti
|

Updated on: Oct 16, 2026 | 3:33 PM

Share

సినిమా రంగంలో సక్సెస్ సాధించడం వెనుక ఎవరి ప్రయాణం చూసినా ఎన్నో కష్టాలు, కన్నీళ్లు దాగుంటాయి. కొందరు చిన్న వయసులోనే అనేక అవమానాలను ఎదుర్కొని ఆపై ఉన్నత స్థాయికి చేరుకుంటారు. అలాంటి ఒక ఆసక్తికరమైన నేపథ్యం ఉన్న ఓ ప్రముఖ నటి గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. ఒకప్పుడు పూట గడవడం కోసం పెళ్లిళ్లలో వెయిటర్‌గా పనిచేసి, కేవలం రూ.50 జీతం తీసుకున్న ఆ నటి ఎవరో కాదు.. బాలీవుడ్ వివాదాస్పద నటి, ప్రముఖ ఐటమ్ సాంగ్స్ తార రాఖీ సావంత్. రాఖీ సావంత్ బాల్య జీవితం అత్యంత దయనీయంగా, పేదరికంతో గడిచింది. తినడానికి సరైన తిండి కూడా దొరకని రోజుల్లో, కడుపు నింపుకోవడం కోసం చెత్తాచెదారంలో పడేసిన మిగిలిపోయిన ఆహారాన్ని తిని బతికినట్లు ఆమె స్వయంగా అనేకసార్లు వెల్లడించారు. నటనపై, డ్యాన్స్‌పై ఉన్న మక్కువతో ఇండస్ట్రీలోకి రావాలని ప్రయత్నిస్తే కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఇంట్లో వాళ్ళను ఎదిరించి మరీ ఆమె చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు.

1997లో విడుదలైన ‘అగ్నిచక్ర’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన రాఖీ సావంత్, ఆ తర్వాత సినిమాలలో ప్రధాన పాత్రలు కాకపోయినా తనదైన స్పెషల్ డ్యాన్స్ నంబర్లతో విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. ‘పర్దేసియా’, ‘మై హూ నా’ (షారుఖ్ ఖాన్‌తో కలిసి) వంటి పాపులర్ పాటలతో ఆమె దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ఒక దశలో బాలీవుడ్‌లో అత్యధిక పారితోషకం తీసుకునే స్పెషల్ డ్యాన్సర్‌గా ఎదిగారు.

అయితే కెరీర్ పరంగా ఎన్నో విజయాలు అందుకున్నప్పటికీ, ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం పలు వివాదాలు, ఇబ్బందులతో సాగింది. మొదటి సీజన్ ‘బిగ్ బాస్’తో సహా పలు రియాలిటీ షోలలో పాల్గొని ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న రాఖీ సావంత్, దుబాయ్‌లో ఒంటరిగా నివసిస్తున్నారు. ఎన్నో కష్టాలను ఎదురించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం.

ఎక్కువ మంది చదివినవి : Trending Song: యూట్యూబ్ షేక్ చేస్తున్న బతుకమ్మ సాంగ్.. రెండు రోజుల్లోనే 7 లక్షల వ్యూస్.. డీజేలలో మారుమోగిపోతుంది..

రాఖీ సావంత్..

Rakhi Sawant Movies

Rakhi Sawant Movies

ఎక్కువ మంది చదివినవి :  Cinema : ఇదేం సినిమా రా నాయనా.. సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చి దుమ్ములేపుతున్న మూవీ.. ట్రెండింగ్ నంబర్ 1గా రచ్చ రచ్చ..

Follow Us