AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gharana Mogudu: చిరంజీవితో ఘరానా మొగుడు సినిమా మిస్సయ్యా.. ఇన్నాళ్లకు కారణం చెప్పిన టాలీవుడ్ హీరోయిన్..

తెలుగు సీనియర్ హీరోయిన్ తన సినీ ప్రస్థానం, బాల్య వివాహం వల్ల కోల్పోయిన అవకాశాలపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. "మిస్టర్ పెళ్ళాం" వంటి చిత్రాలు ఎలా చేజారాయో వివరించారు. తన తల్లిదండ్రులు ఇచ్చిన రక్షణ, త్వరితగతిన వచ్చిన అవకాశాలు, ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రణాళికల గురించి మాట్లాడారు.

Gharana Mogudu: చిరంజీవితో ఘరానా మొగుడు సినిమా మిస్సయ్యా.. ఇన్నాళ్లకు కారణం చెప్పిన టాలీవుడ్ హీరోయిన్..
Gharana Mogudu
Rajitha Chanti
|

Updated on: Oct 16, 2026 | 3:13 PM

Share

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఘరానా మొగుడు వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను ఎందుకు చేయలేకపోయారనే ప్రశ్నలకు హీరోయిన్ దివ్యవాణి స్పందించారు. అలాగే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానాన్ని, కోల్పోయిన అవకాశాలను, వ్యక్తిగత జీవితపు మలుపులను వివరించారు. తాను ఇండస్ట్రీలోకి ఎంతో సులువుగా అడుగుపెట్టానని, అవకాశాల కోసం ఎప్పుడూ వెతుక్కోవాల్సిన అవసరం రాలేదని ఆమె గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా, తన తల్లి , సోదరి తన కెరీర్‌ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారని, సినిమా కార్యాలయాల గడప ఎక్కకుండానే తానేమిటో చూపించారని తెలిపారు. అప్పట్లో విడుదలైన ఆల్బమ్‌లు, దర్శకుడు వంశీ, ఎస్పీ వెంకన్న బాబు వంటి ప్రముఖుల సహకారంతో త్వరగానే గుర్తింపు వచ్చిందని చెప్పారు. అయితే, కెరీర్ ఉచ్ఛస్థితిలో ఉండగానే వివాహం చేసుకోవడం తనను ఎన్నో గొప్ప అవకాశాలకు దూరం చేసిందని దివ్యవాణి అంగీకరించారు. అప్పట్లో వివాహిత నటీమణుల కెరీర్ ముగిసినట్లేనని భావించేవారని, కానీ నేటి తరం నటీనటులు వివాహానంతరం కూడా కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నారని, ఇది తమ తరానికి లేని తెలివైన నిర్ణయమని పేర్కొన్నారు. తాను ఆనాడు తీసుకున్న నిర్ణయం పట్ల ఇప్పుడు కొంత బాధగా ఉందని, ఇంకాస్త సమయం ఇండస్ట్రీలో ఉండి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.

“మిస్టర్ పెళ్ళాం” వంటి ముఖ్యమైన చిత్రాలను ఎలా కోల్పోయారో దివ్యవాణి వివరించారు. బాపు-రమణ వంటి దిగ్గజ దర్శకులు ఆ చిత్రంలో తనను తీసుకోవాలని కోరుకున్నప్పటికీ, అప్పటి హీరో అభ్యంతరం చెప్పారని, కొత్త అమ్మాయిని తీసుకోవాలని కోరడంతో ఆ అవకాశం చేజారిందని ఆమె స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తర్వాత ఆమని, స్నేహ వంటి నటీమణులు కూడా ప్రస్తావించారని ఆమె తెలిపారు. ఇలాంటి కారణాల వల్ల కొన్ని మంచి చిత్రాలను కోల్పోవాల్సి వచ్చిందని పరోక్షంగా పేర్కొన్నారు. అయినప్పటికీ, తమతో పనిచేసిన రేలంగి నరసింహారావు, పి.ఎన్. రామచంద్రరావు, కోదండరామి రెడ్డి వంటి దర్శకులు తమను ఎంతో గౌరవంగా చూశారని దివ్యవాణి అన్నారు.

వృత్తిపరంగా ఎదురైన సవాళ్లతో పాటు, దివ్యవాణి తన వ్యక్తిగత జీవితం గురించి కూడా మాట్లాడారు. తన తల్లి ప్రోద్బలంతో కఠినమైన ఆహార నియమాలు, నృత్య శిక్షణతో ఫిట్‌నెస్‌ను కాపాడుకునేవారట. ప్రస్తుతం తన పిల్లలిద్దరూ యూఎస్ఏలో స్థిరపడగా, తాను తన జీవితంలో రెండవ దశను ప్లాన్ చేసుకుంటున్నానని తెలిపారు. భక్తి, ప్రజాసేవ వంటి రంగాలలో తన వంతు కృషి చేయాలని కసిగా ఉన్నానని, మళ్లీ తెరపైకి రావడానికి సిద్ధంగా ఉన్నానని ఆమె వెల్లడించారు. ఈ మధ్యకాలంలో తన గ్లామర్, ఫిట్‌నెస్ గురించి వస్తున్న ప్రశంసలను ఆమె అందుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Trending Song: యూట్యూబ్ షేక్ చేస్తున్న బతుకమ్మ సాంగ్.. రెండు రోజుల్లోనే 7 లక్షల వ్యూస్.. డీజేలలో మారుమోగిపోతుంది..

ఘరానా మొగుడు సినిమా..

Gharana Mogudu, Divya Vani (1)

Gharana Mogudu, Divya Vani (1)

ఎక్కువ మంది చదివినవి :  Cinema : ఇదేం సినిమా రా నాయనా.. సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చి దుమ్ములేపుతున్న మూవీ.. ట్రెండింగ్ నంబర్ 1గా రచ్చ రచ్చ..

Follow Us