AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: హర్మన్ బాటలో.. సరికొత్త టీమిండియా నిర్మాణం..: స్మృతి మంధాన ఆసక్తికర వ్యాఖ్యలు..!

Smriti Mandhana: భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్, కెప్టెన్ స్మృతి మంధాన, మాజీ సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంపై ప్రశంసలు కురిపించింది. భారత మహిళా క్రికెట్‌ను ప్రపంచ స్థాయిలో నిలబెట్టడంలో హర్మన్‌ప్రీత్ కౌర్ పోషించిన పాత్ర అమోఘమని, ఆమె నాయకత్వ శైలి, ఒత్తిడిని ఎదుర్కొనే విధానం జట్టుకు బలమైన పునాదిని అందించాయంటూ చెప్పుకొచ్చింది.

Video: హర్మన్ బాటలో.. సరికొత్త టీమిండియా నిర్మాణం..: స్మృతి మంధాన ఆసక్తికర వ్యాఖ్యలు..!
Smriti Mandhana Comments On Harmanpreet Kaur
Venkata Chari
|

Updated on: Oct 16, 2026 | 3:23 PM

Share

Smriti Mandhana: టీమిండియా మార్పు దశ కొనసాగుతోంది. అటు పురుషుల క్రికెట్‌లో కాని, ఇటు మహిళల క్రికెట్‌లోనూ స్పష్టంగా ఈ మార్పులు చోటుచేసుకుంటున్నట్లు చూడొచ్చు. తాజాగా టీమిండియా మహిళల టీం కెప్టెన్‌గా కొనసాగిన హర్మన్ ప్రీత్ కౌర్ బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన వారసురాలిగా స్మృతి మంధాన కొనసాగేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఆమె తాజాగా స్టార్ స్పోర్ట్స్ ఛానల్‌తో మాట్లాడుతూ ఎన్నో కీలక విషయాలు పంచుకున్నాడు. అవేంటో ఓసారి చూద్దాం..!

హర్మన్‌ప్రీత్ నాయకత్వంపై ప్రశంసలు..

దశాబ్దపు అనుభవం: హర్మన్‌ప్రీత్ కౌర్ 10 ఏళ్ల పాటు జట్టును సమర్థవంతంగా నడిపించారని, ఆమెతో కలిసి ఆడటం గొప్ప గౌరవమంటూ స్మృతి కొనియాడింది.

మార్గదర్శకత్వం: ఒక నాయకురాలిగా మైదానంలో దూకుడు, మైదానం బయట సహచరులకు అండగా ఉండే తత్వాన్ని హర్మన్ నేర్పించిందని స్మృతి పేర్కొంది. జట్టులో క్రమశిక్షణ, గెలుపు కసిని నింపడంలో ఆమె పాత్ర కీలకమని తెలిపింది.

యువ ఆటగాళ్ల దూకుడు..

నిర్భయమైన దృక్పథం: భారత జట్టులోకి వస్తున్న కొత్త తరం ఎటువంటి భయం లేకుండా స్వేచ్ఛగా మైదానంలో అడుగుపెడుతున్నారంటూ స్మృతి ప్రశంసించింది. ఇదే దూకుడుతో ఎటువంటి బౌలింగ్‌నైనా చిత్తు చేసేందుకు వాళ్లు మానసికంగా సిద్ధమయ్యారంటూ చెప్పుకొచ్చింది.

బాధ్యత తీసుకునే తత్వం: క్లిష్ట సమయాల్లోనూ సీనియర్లపై భారం వేయకుండా, యువ క్రీడాకారిణులు మ్యాచ్ విన్నర్లుగా మారుతుండటం భారత జట్టు విజయ రహస్యమని ఆమె పేర్కొంది.

డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం: ప్రతి ఒక్కరికీ తమ సహజమైన ఆటతీరును ప్రదర్శించే స్వేచ్ఛను ఇవ్వడమే జట్టు సంస్కృతిగా మారిందని తెలిపింది.

భవిష్యత్ ప్రయాణం..

హర్మన్‌ప్రీత్ అందించిన స్పూర్తితో, భారత మహిళా క్రికెట్ సరికొత్త శిఖరాలను అధిరోహించేందుకు సిద్ధంగా ఉందని స్మృతి స్పష్టం చేసింది. సీనియర్ల అనుభవం, యువ ఆటగాళ్ల ఉత్సాహం తోడైతే మరిన్ని ఐసీసీ ట్రోఫీలను భారత్ సొంతం చేసుకోవడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us