AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gertie: ప్రపంచ రికార్డు సాధించి పండు కోడి.. దీని కథ తెలిస్తే ఆశ్చర్యపోతారు!

అమెరికాకు చెందిన గెర్టీ కోడి 15 ఏళ్ల 100 రోజుల వయసులో ప్రపంచంలోనే అత్యంత వయసున్న జీవించి ఉన్న కోడిగా గిన్నిస్ రికార్డు సృష్టించింది. కంటిచూపు మందగించడం, ఇతర కోళ్ల ఇబ్బందులు వంటి సవాళ్లను అధిగమించి, యజమాని ప్రత్యేక శ్రద్ధతో గెర్టీ దీర్ఘాయువును పొందింది. మంచి ఆహారం, సంరక్షణ, సురక్షిత వాతావరణం, ప్రేమతో గెర్టీ ఇప్పుడు జంతుప్రేమికులకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

Balaraju Goud
|

Updated on: Oct 16, 2026 | 3:25 PM

Share
సాధారణంగా కోళ్లు కొన్ని సంవత్సరాలు మాత్రమే జీవిస్తాయని చాలామంది భావిస్తారు. కానీ అమెరికాకు చెందిన గెర్టీ అనే కోడి ఈ అభిప్రాయాన్ని మార్చేసింది. ఏకంగా 15 ఏళ్ల 100 రోజుల వయసులో ప్రపంచంలోనే అత్యంత వయసున్న జీవించి ఉన్న కోడిగా రికార్డు సృష్టించింది. వయసు పెరగడంతో కంటిచూపు మందగించినా, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నా.. తనదైన శైలిలో జీవనం సాగిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

1 / 5
గెర్టీ గోల్డెన్ సెబ్రైట్ జాతికి చెందిన కోడి. గోధుమ, నలుపు రంగుల మచ్చలతో ఉండే ఈ కోడి తన ప్రత్యేకమైన రూపంతో ఆకట్టుకుంటుంది. దీని యజమాని ఫ్రాంక్ టురెక్ 2010లో ఆన్‌లైన్‌లో ఎనిమిది కోడిపిల్లలను ఆర్డర్ చేయగా, వాటిలో గెర్టీ కూడా ఒకటి. చిన్నప్పటి నుంచి ప్రత్యేక శ్రద్ధతో పెంచిన ఈ కోడి.. క్రమంగా తన మందలో ఆధిపత్యం చెలాయించే స్థాయికి చేరుకుంది. ఫ్రాంక్ దానిని సరదాగా మందకు చిన్న నాయకురాలిగా పిలిచేవాడు. ఒక దశలో కోడిపుంజులా కూయడం కూడా ప్రారంభించింది.

2 / 5
కాలం గడిచేకొద్దీ గెర్టీ వృద్ధాప్యంలోకి అడుగుపెట్టింది. క్రమంగా గుడ్లు పెట్టడం మానేసింది. 2024లో దాని కంటిచూపు మందగిస్తున్నట్లు ఫ్రాంక్ గుర్తించాడు. రాత్రిపూట గూటిపైకి ఎక్కడం కూడా కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఇతర కోళ్లు దానిని ఇబ్బంది పెట్టడం ప్రారంభించాయి. ఒక క్రిస్మస్ రోజున కోళ్ల గదిలో శబ్దం విన్న ఫ్రాంక్ అక్కడికి వెళ్లి చూడగా, గెర్టీ తలకు తీవ్ర గాయమై కనిపించింది. వెంటనే దానిని ఇంట్లోకి తీసుకొచ్చి, గాయాన్ని శుభ్రం చేసి జాగ్రత్తగా చూసుకున్నాడు. ఆ తర్వాత గెర్టీ కోసం ఇంట్లోనే ప్రత్యేకమైన సురక్షిత ప్రదేశాన్ని ఏర్పాటు చేశాడు.

3 / 5
ప్రస్తుతం గెర్టీ మనుషుల సాంగత్యాన్ని ఇష్టపడుతోంది. ఫ్రాంక్ దానితో మాట్లాడినా, పాటలు పాడినా తన స్వరంతో స్పందిస్తుందని చెబుతున్నాడు. అంతేకాదు, గ్రేట్ డేన్ జాతికి చెందిన భారీ పెంపుడు కుక్కతోనూ స్నేహంగా ఉంటోంది. మొదట్లో రాత్రిపూట గూటికి చేరేందుకు యజమాని సహాయం అవసరమైనప్పటికీ, తర్వాత గెర్టీ స్వయంగా గూటిపైకి ఎక్కడం నేర్చుకుంది.

4 / 5
15 ఏళ్ల 100 రోజుల వయసులో గెర్టీ ప్రపంచంలోనే అత్యంత వయసున్న జీవించి ఉన్న కోడిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తింపు పొందింది. గతంలో ఈ రికార్డు టెక్సాస్‌కు చెందిన పెర్ల్ అనే కోడి పేరిట ఉండేది. గెర్టీ ఇంతకాలం జీవించడానికి మంచి ఆహారం, సరైన సంరక్షణ, సురక్షితమైన వాతావరణం, వేటాడే జంతువుల నుంచి రక్షణ ముఖ్యమైన కారణాలని ఫ్రాంక్ భావిస్తున్నాడు. వృద్ధాప్యం, గాయాలు వంటి సవాళ్లను అధిగమించి తన జీవితాన్ని కొనసాగిస్తున్న గెర్టీ కథ ఇప్పుడు జంతుప్రేమికుల దృష్టిని ఆకర్షిస్తోంది.

5 / 5
Follow Us