Manju Warrier: ప్రేమ పెళ్లి ఆ తర్వాత విడాకులు.. చివరకు కూతురు దూరం.. పడి లేచిన కెరటం మంజు వారియర్..
ఒకప్పుడు వ్యక్తిగత జీవితంలో పలు సమస్యలు ఎదుర్కొని.. మానసిక ఒత్తిడికి గురై కొన్నేళ్లపాటు బయటకు రాలేదు. కానీ కష్టాలను ఎదురించి ధైర్యంగా తన గళాన్ని వినిపించి ఇప్పుడు జీవితాన్ని గెలిచింది. కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్న సాంగ్ మనసియలాయో. ఈ పాటలో ఎర్ర చీరలో.. కళ్లకు కూలింగ్ గ్లాసెస్‌తో డాన్స్ అదరగొట్టింది మంజు వారియర్. ప్రస్తుతం ఆమె వయసు 46 సంవత్సరాలు. అయినా ఇప్పటి కుర్ర హీరోయిన్లకు గట్టిపోటినిస్తూ చేతినిండా సినిమాలతో దూసుకుపోతుంది. నాలుగు పదుల వయసు దాటినా హుషారెత్తించేలా ఆమె వేసిన స్టెప్పులు యువతను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో సత్తా చాటుతుంది. కానీ మీకు తెలుసా..? ఒకప్పుడు వ్యక్తిగత జీవితంలో పలు సమస్యలు ఎదుర్కొని.. మానసిక ఒత్తిడికి గురై కొన్నేళ్లపాటు బయటకు రాలేదు. కానీ కష్టాలను ఎదురించి ధైర్యంగా తన గళాన్ని వినిపించి ఇప్పుడు జీవితాన్ని గెలిచింది. కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది.
1978లో తమిళనాడులో జన్మించిన మంజు వారియర్ చిన్నవయసులోనే కూచిపూడి శిక్షణలో తీసుకున్నారు. బుల్లితెరపై మనోహరం సీరియల్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి 17 ఏళ్ల వయసులోనే సాక్ష్యం మూవీలో కీలకపాత్ర పోషించింది. ఆ తర్వాత ఏడాది సల్లాపం సినిమాతో కథానాయికగా వెండితెరపై మెరిసింది. మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. 1995 నుంచి 99 వరకు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించింది. దాదాపు 20కి పైగా చిత్రాల్లో నటించి అలరించింది. నాలుగేళ్ల వ్యవధిలోనే ఈ పూజయుం కాదన్ను సినిమాకు ఉత్తమ నటిగా కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్ అందుకుంది. కన్నేయితి పొట్టుం తొట్టు సినిమాతో నేషనల్ అవార్డ్.. నాలుగు ఫిలిం ఫేర్ అవార్డ్స్ అందుకుంది.
1996లో సల్లాపం సినిమాలో నటించిన హీరో దిలీప్ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి.. 1998లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక పాప జన్మించింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండిపోయింది. కానీ 16 ఏళ్ల వైవాహిక బంధం అర్ధాంతరంగా ముగిసింది. నటి కావ్యతో తన భర్త రిలేషన్ షిప్ లో ఉన్నాడన్న విషయం తెలుసుకుంది. దీంతో అతడి నుంచి 2014 లో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత తన భర్త నటి కావ్యను రెండో వివాహం చేసుకున్నారు. విడాకుల తర్వాత తన కూతురు కూడా తనతో ఉండేందుకు నిరాకరించింది. కోర్టులో తన తండ్రిని ఎంచుకుంది. దీంతో మంజు వారియర్ తీవ్ర మనోవేదనకు గురైంది. ఆ బాధతో చాలాకాలం పాటు తెరకు దూరమయ్యింది. 15 ఏళ్ల తర్వాత హౌ ఓల్డ్ ఆర్ యూ సినిమాతో 2014లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత లూసిఫర్, విలన్, మోహన్ లాల్, అసురన్, తునివు సినిమాలతో అలరించింది. ప్రస్తుతం రజినీ సరసన వేట్టైయాన్ చిత్రంలో నటిస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.