‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌.. బెల్లంకొండ శ్రీనివాస్‌తో జత కట్టబోతోన్న కియారా అద్వానీ..!

ప్రభాస్ ఛత్రపతి హిందీ రీమేక్‌లో బెల్లంకొండ శ్రీనివాస్ నటించబోతున్న విషయం తెలిసిందే. మాస్ డైరెక్టర్ వివి వినాయక్ ఈ రీమేక్‌కి దర్శకత్వం వహించనున్నారు

'ఛత్రపతి' హిందీ రీమేక్‌.. బెల్లంకొండ శ్రీనివాస్‌తో జత కట్టబోతోన్న కియారా అద్వానీ..!
Follow us

| Edited By:

Updated on: Nov 29, 2020 | 2:54 PM

Chatrapathi hindi remake: ప్రభాస్ ఛత్రపతి హిందీ రీమేక్‌లో బెల్లంకొండ శ్రీనివాస్ నటించబోతున్న విషయం తెలిసిందే. మాస్ డైరెక్టర్ వివి వినాయక్ ఈ రీమేక్‌కి దర్శకత్వం వహించనున్నారు. ఈ మూవీ ద్వారా ఇటు బెల్లంకొండ, అటు వినాయక్ ఇద్దరూ బాలీవుడ్‌కి పరిచయం అవ్వబోతున్నారు. ఇక అక్కడి ప్రేక్షకులకు అనుగుణంగా విజయేంద్రప్రసాద్‌ ఈ రీమేక్‌లో మార్పులు చేయబోతున్నారు. పెన్ స్టూడియోస్ ఈ రీమేక్‌ని నిర్మిస్తోంది.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా తాజా సమాచారం ప్రకారం ఇందులో హీరోయిన్‌గా కియారా అద్వాణీ పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్. ఒకవేళ అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తోంది.

కాగా ప్రస్తుతం బెల్లంకొండ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లుడు అదుర్స్‌లో నటిస్తున్నారు. ఇందులో నభా నటేష్‌, అను ఇమ్మాన్యుల్‌ హీరోయిన్‌లుగా కనిపిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌ త్వరలో పూర్తి కానుండగా.. ఆ తరువాత ఛత్రపతి రీమేక్ కోసం బెల్లంకొండ వర్కౌట్లు చేయనున్నారు.