AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేసిన తప్పే మళ్లీ చేస్తోన్న రెబల్ స్టార్ ప్రభాస్, డార్లింగ్ కాస్త చూస్కో అంటోన్న ఫ్యాన్స్

 సాహో కోసం సుజీత్ టీమ్ ఎంత కష్టపడిందో ప్రత్యకంగా చెప్పాల్సిన పనిలేదు. పక్కా తెలుగు నేటివిటీ వున్న డైరెక్టరే అయినా.. తన డార్లింగ్ ని నార్త్ కి ఇంకాస్త దగ్గర చేద్దామన్న ప్లానింగ్ తో సాహోకు...

చేసిన తప్పే మళ్లీ చేస్తోన్న రెబల్ స్టార్ ప్రభాస్, డార్లింగ్ కాస్త చూస్కో అంటోన్న ఫ్యాన్స్
Ram Naramaneni
|

Updated on: Nov 29, 2020 | 2:32 PM

Share

సాహో కోసం సుజీత్ టీమ్ ఎంత కష్టపడిందో ప్రత్యకంగా చెప్పాల్సిన పనిలేదు. పక్కా తెలుగు నేటివిటీ వున్న డైరెక్టరే అయినా.. తన డార్లింగ్ ని నార్త్ కి ఇంకాస్త దగ్గర చేద్దామన్న ప్లానింగ్ తో సాహోకు స్పెషల్ స్కెచ్ గీసుకున్నారు సుజీత్. కట్ చేస్తే.. ఆ సినిమా అక్కడివాళ్లకు బాగానే కనెక్ట్ అయింది. ఇక్కడ మాత్రం బిలో యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. దీనిక్కారణాలు ఎన్నున్నా.. అసలు కారణం మాత్రం ఆ కాస్టింగే. నార్త్ భామ శ్రద్ధా కపూర్ ని మనోళ్లు ఆశించినంతగా జీర్ణించుకోలేకపోయారు. మురళిశర్మ, వెన్నెల కిషోర్ తప్పితే తెలుగు వాసనే లేదు సాహోలో.

ఇప్పుడు నార్త్ డైరెక్టర్ ఓం రౌత్ చేస్తున్న ఆదిపురుష్ కూడా అదే రూట్లో నడుస్తోంది. ఇప్పటివరకూ వినిపిస్తున్న కాస్టింగ్ డీటెయిల్స్ అన్నీ నార్త్ సైడ్ కి చెందినవే. ప్రభాస్ రాముడిగా చేస్తుంటే తమ్ముడు లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు. రావణాసురుడి పాత్రలో సైఫ్ ఆలీ ఖాన్ ఫైనల్ అయ్యారు. ఆయన కొడుకుగా మరో బాలీవుడ్ యాక్టర్ అంగద్ బేడీ కూడా అక్కడివాడే. ఇక సీత పాత్రకు ఫస్ట్ ఛాయిస్ గా క్రితి సనన్ పేరే గట్టిగా వినిపిస్తోంది.

మొత్తం ఐదు సినిమాలకు సైన్ చేసి బాలీవుడ్ లో బిజీయెస్ట్ హీరోయిన్ గా చక్రం తిప్పుతున్నారు క్రితి సనన్. ఆమెకున్న గ్లామరస్ బజ్ ని తన సినిమాకు యూజ్ చేసుకోవాలన్నది ఓం గారి మాస్టర్ ప్లాన్ కావొచ్చు. కానీ.. టాలీవుడ్ లో జస్ట్ ఒక్క సినిమాతోనే పరిచయమున్న క్రితిని.. తెలుగు ఆడియెన్స్ ఎంత మేరకు ఓన్ చేసుకుంటారన్నది మిలియన్ డాలర్ల డౌటే. సినిమాలో ఒక్క ప్రభాస్ మినహాయిస్తే ఏ టు జెడ్ అన్నీ నార్త్ కలర్సే కనిపించడం.. ఆదిపురుష్ కి సౌత్ లో ప్లస్సా లేక మైనస్సా..! అనేది ఆ డైరెక్టర్ గారికే తెలియాలి. ఏదేమైనా సాహో నాటి బిట్టర్ ఎక్స్ పీరియన్స్ రిపీట్ కాకూడన్నది డైహార్డ్ ఫ్యాన్స్ కోరిక.

Also Read :

హత్యాయత్నంపై స్పందించిన పేర్ని నాని, కృష్ణా జిల్లా ఎస్పీ.. నిందితుడు అందుకే దాడి చేశాడట

టెక్సాస్‌లో రోడ్డు ప్రమాదం, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తెలుగు వ్యక్తులు మృతి

మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..