Sunny Leone: సన్నీలియోన్‌కి భారీ ఊరట.. ముందస్తు బెయిల్ మంజూరు చేసిన కేరళ హైకోర్టు
Sunny Leone gets relief : ఈవెంట్ మేనేజ్‌మెంట్ చీటింగ్ కేసులో బాలీవుడ్ నటి సన్నీలియోన్‌కు ఊరట దక్కింది. ఈ కేసులో అరెస్టు చేయకుండా ఆమెతోపాటు ఆమె భర్త డేనియల్‌కు కేరళ హైకోర్టు..

Big relief to Sunny Leone : ఈవెంట్ మేనేజ్‌మెంట్ చీటింగ్ కేసులో బాలీవుడ్ నటి సన్నీలియోన్‌కు ఊరట దక్కింది. ఈ కేసులో అరెస్టు చేయకుండా ఆమెతోపాటు ఆమె భర్త డేనియల్‌కు కేరళ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
2019లో ప్రేమికుల దినోత్సవం రోజున తాము ఏర్పాటు చేసిన రెండు ఈవెంట్లలో సన్నీలియోన్ పాల్గొంటానని చెప్పి అప్పట్లో తమ వద్ద నుంచి రూ.29 లక్షలు తీసుకుందని.. కానీ ఆమె మాత్రం పాల్గొనలేదని పేర్కొంటూ ఇటీవల ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ కేరళ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమెను విచారించారు. ఈ క్రమంలోనే ముందస్తు బెయిల్ కోరుతూ సన్నీలియోనీ కేరళ హైకోర్టును ఆశ్రయించారు.
ఇవీ కూడా చదవండి..
Telangana: తెలంగాణ కరోనా బులిటెన్.. కొత్తగా 157 పాజిటివ్ కేసులు, ఒకరు మృతి..