Adipurush: ప్రభాస్ ‘ఆదిపురుష్’.. సీతగా కీర్తి!
రెబల్ స్టార్ ప్రభాస్ మరో క్రేజీ చిత్రంలో నటించబోతున్నారు. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఓమ్ రౌత్, ప్రభాస్‌తో ఆదిపురుష్ అనే సినిమాను తెరకెక్కించబోతున్నారు

Prabhas Adipurush movie: రెబల్ స్టార్ ప్రభాస్ మరో క్రేజీ చిత్రంలో నటించబోతున్నారు. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఓమ్ రౌత్, ప్రభాస్‌తో ఆదిపురుష్ అనే సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు ప్రభాస్. ఇక రామాయణం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కబోతున్నట్లు పోస్టర్‌ని చూస్తే అర్థం అవుతుండగగా.. ఇందులో ప్రభాస్, రాముడిగా కనిపించబోతున్నట్లు మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ రివీల్ చేశారు. దీంతో ప్రభాస్ పాత్రపై క్లారిటీ రాగా.. మిగిలిన పాత్రల్లో ఎవరు నటిస్తారన్న చర్చ ప్రస్తుతం ఫిలింనగర్ వర్గాల్లో నడుస్తోంది.
కాగా ప్రభాస్ క్రేజ్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తుండగా.. మిగిలిన పాత్రలకు కూడా పాపులర్ నటీనటులనే తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో విలన్‌గా సైఫ్ అలీ ఖాన్, సీతగా కీర్తి సురేష్ పేరు వినిపిస్తోంది. మహానటితో జాతీయ అవార్డును సొంతం చేసుకున్న కీర్తికి దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. అందులోనూ సీత వంటి క్లాసిక్ పాత్రకు కీర్తి కచ్చితంగా న్యాయం చేయగలదని దర్శకనిర్మాతలు భావిస్తున్నారని సమాచారం. ఈ క్రమంలో సీతగా కీర్తితో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్‌కి కీర్తి కన్ఫర్మ్ అయితే మరో క్రేజీ పెయిర్‌ని తెర మీద చూసే అవకాశం ప్రేక్షకులకు లభిస్తుంది. కాగా ప్రస్తుతం కీర్తికి తెలుగు, తమిళ్‌లో వరుస సినిమాలు చేస్తోన్న విషయం తెలిసిందే.
Read More: