Keerthy suresh: డేటింగ్ వార్తలపై స్పందించిన కీర్తి సురేష్ తండ్రి.. కుటుంబంలో మనఃశాంతి కరువవుతోందంటూ
మహా నటి కీర్తి సురేష్ ఇటీవల నిత్యం వార్తల్లో నిలుస్తోంది. అయితే నిత్యం సినిమాలతో హెడ్‌లైన్స్‌లో నిలిచే కీర్తి సురేష్ ఈసారి మాత్రం వ్యక్తిగత జీవితానికి సంబంధించి వార్తల్లోకెక్కింది. కీర్తి సురేష్ ఓ అబ్బాయితో డేటింగ్‌లో ఉందని, త్వరలోనే సదరు వ్యక్తితో పెళ్లి పీటలెక్కనుందనేది సదరు వార్త సారాంశం. అందులోనూ కీర్తి సురేష్...
మహా నటి కీర్తి సురేష్ ఇటీవల నిత్యం వార్తల్లో నిలుస్తోంది. అయితే నిత్యం సినిమాలతో హెడ్‌లైన్స్‌లో నిలిచే కీర్తి సురేష్ ఈసారి మాత్రం వ్యక్తిగత జీవితానికి సంబంధించి వార్తల్లోకెక్కింది. కీర్తి సురేష్ ఓ అబ్బాయితో డేటింగ్‌లో ఉందని, త్వరలోనే సదరు వ్యక్తితో పెళ్లి పీటలెక్కనుందనేది సదరు వార్త సారాంశం. అందులోనూ కీర్తి సురేష్ ఓ అబ్బాయితో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేయడంతో ఈ వార్తలకు బలం చేకూర్చినట్లైంది. అందులోనూ ఇద్దరూ ఒకే కలర్ డ్రస్ ధరించడంతో ఈ వార్తలకు మరింత ఊతమిచ్చినట్లైంది.
అయితే ఈ వార్తలకు ఎంతకూ ఫుల్ స్టాప్ పడకపోయే సరికి కీర్తి సురేష్ స్వయంగా స్పందించింది. నెట్టింట వైరల్ అవుతోన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేల్చి చెప్పింది. ఫొటోలో ఉన్న వ్యక్తి తన స్నేహితుడనే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. నా బెస్ట్ ఫ్రెండ్‌ను కూడా వార్తల్లోకి లాగేశారా అంటూ.. నిజమైన మిస్టరీ మ్యాన్‌ను సమయం వచ్చినప్పుడు తప్పకుండా పరిచయం చేస్తాను. అప్పటివరకూ చిల్‌గా ఉండండి. ఒక్కసారి కూడా సరైన వార్తలు రాలేదంటూ ట్వీట్ చేసింది. అయితే కీర్తి క్లారిటీ ఇచ్చినప్పటికీ వార్తలకు మాత్రం అడ్డుకట్ట పడలేకపోయింది.
అయితే తాజాగా ఈ వార్తలపై కీర్తి సురేష్ తండ్రి కూడా స్పందించారు. తన కూతురు ఒక అబ్బాయితో డేటింగ్‌లో ఉందని, ఆమె అతనితో పెళ్లి చేసుకోబోతోందని సోషల్ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయని, అవన్నీ ఫేక్ న్యూస్ అని చెప్పుకొచ్చారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. ‘నాకు అబ్బాయి తెలుసు. అతడు సన్నిహిత కుటుంబ స్నేహితుడు. ఫర్హాన్ పుట్టినరోజున, కీర్తి కొన్ని ఫోటోగ్రాఫ్‌లను పోస్ట్ చేసింది. వాటిని ఒక తమిళ ఆన్‌లైన్ మ్యాగజైన్ సేకరించింది. కీర్తి పెళ్లి ఫిక్స్ అయితే మీడియాకు, ప్రజలకు ముందుగా తెలియజేస్తాము. అసత్యాలు, తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దు. ఇలాంటి తప్పుడు వార్తలు వైరల్ చేయడం కారణంగా కుటుంబంలో మనఃశాంతి కరువవుతుందని’ ఆవేదన వ్యక్తం చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..