Anirudh – Kavya Maran Wedding: కావ్య మారన్, అనిరుధ్ పెళ్లి.. ఇద్దరి ఏజ్ గ్యాప్ ఎంతంటే.. ?
సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్, ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త నెట్టింట సంచలనంగా మారింది. గ్రీస్‌లో జరగనున్న ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ ప్రచారాల మధ్య, కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్న ఈ ఇద్దరిలో ఎవరు ఎక్కువ శ్రీమంతులు అనే చర్చ ప్రస్తుతం అభిమానుల్లో తీవ్రంగా నడుస్తోంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ, సన్ నెట్వర్క్ వారసురాలు కావ్య మారన్, సౌత్ ఇండియన్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వార్త ప్రస్తుతం దేశవ్యాప్తంగా తెగ వైరల్ గా మారింది. ఇప్పటికే కావ్య మారన్ తండ్రి కళానిధి మారన్ ఆహ్వానాలు మొదలుపెట్టారు. వచ్చే నెలలో వీరిద్దరి వివాహం జరగనుంది. ఈ క్రమంలోనే గ్రీస్‌లో జరగనున్న వీరి వివాహ వేడుకలతో పాటు, వీరిద్దరి, వ్యత్యాసం, వ్యక్తిగత ఆస్తుల వివరాలపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది. కావ్య మారన్ , అనిరుధ్ రవిచందర్ ఇద్దరూ తమ తమ రంగాలలో అగ్రస్థానంలో కొనసాగుతూ అత్యధికంగా సంపాదిస్తున్నారు. ఇద్దరికీ ఎవరి రంగాల్లో వారికి మంచి గుర్తింపు ఉంది.
ఎక్కువ మంది చదివినవి : Nartanasala Movie: బృహన్నలగా ఎన్టీఆర్ విశ్వరూపం.. నర్తనశాల వెనుక ఉన్న ఈ అరుదైన నిజాలు తెలుసా.. ?
సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్ కుమార్తె అయిన కావ్య మారన్ వ్యక్తిగత ఆస్తి విలువ దాదాపు రూ. 400 కోట్ల నుండి రూ. 500 కోట్లు ఉంటుందని అంచనా. ఇక సన్ టీవీ నెట్వర్క్, ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ , సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోని సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీమ్‌ల వ్యాపార బాధ్యతలను ఆమె దగ్గరుండి చూసుకుంటున్నారు. సన్ గ్రూప్ మొత్తం ఆస్తి విలువ ఏకంగా రూ. 26,000 కోట్లకు పైగా ఉండటం గమనార్హం.
ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే చాలు జీవితం మారిపోతుంది.. డబ్బు సంపాదనకు మురళీ మోహన్ ఇచ్చిన సలహాలు..
ప్రస్తుతం దక్షిణాది చిత్రసీమలోనే మోస్ట్ వాంటెడ్ అండ్ హయ్యెస్ట్ పెయిడ్ మ్యూజిక్ కంపోజర్‌గా అనిరుధ్ దూసుకుపోతున్నారు. ఆయన ఒక్కో సినిమాకు రూ. 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. నివేదికల ప్రకారం, అనిరుధ్ వ్యక్తిగత నికర ఆస్తి విలువ దాదాపు రూ. 60 కోట్ల నుండి రూ. 80 కోట్లుగా ఉంది.
ఎక్కువ మంది చదివినవి : Trending Song: యూట్యూబ్ షేక్ చేస్తున్న బతుకమ్మ సాంగ్.. రెండు రోజుల్లోనే 7 లక్షల వ్యూస్.. డీజేలలో మారుమోగిపోతుంది..
ఏజ్ గ్యాప్ & వెడ్డింగ్ వివరాలు..
వీరిద్దరి వయసు మధ్య వ్యత్యాసం కేవలం రెండేళ్లు మాత్రమే. ప్రస్తుతం అనిరుధ్ రవిచందర్‌కు 36 సంవత్సరాలు కాగా, కావ్య మారన్‌కు 34 సంవత్సరాలు. ఈ జంట గ్రీస్‌లో అత్యంత వైభవంగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారని, అనంతరం నవంబర్ 21న గ్రాండ్‌గా రిసెప్షన్ నిర్వహించనున్నారని సమాచారం.
ఎక్కువ మంది చదివినవి : Cinema : ఇదేం సినిమా రా నాయనా.. సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చి దుమ్ములేపుతున్న మూవీ.. ట్రెండింగ్ నంబర్ 1గా రచ్చ రచ్చ..
