Rajinikanth: జిమ్ లేదు.. డైట్ లేదు.. 75 ఏళ్ల వయసులో అదరగొట్టిన రజినీ.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదనట..
సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పుడు జైలర్ 2తో మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు. ఏడు పదుల వయసులోనూ యంగ్ హీరోలకు ధీటుగా కొత్త సినిమాతో థియేటర్లను షేక్ చేశాడు. ఇక ఈ మూవీలో రజినీ స్టైల్, ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదంటున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలో ఇప్పుడు రజినీ ఫిట్నెస్, డైట్ సీక్రెట్స్ సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతుంది.

సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఏడు పదుల వయసులోనూ జైలర్ 2 సినిమాతో సంచలన విజయం సాధించాడు. భారీ హైప్ మధ్య విడుదలైన ఈ మూవీ ఇప్పుడు కేవలం రెండు రోజుల్లోనే బాక్సాఫీస్ షేక్ చేస్తుంది. ఇందులో రజినీ స్టైల్, మేనరిజం ఏమాత్రం తగ్గలేదని అంటున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలో ఇప్పుడు 75 ఏళ్ల వయసులో రజినీ అంత ఫిట్ గా ఉండటానికి కారణాలను తెలుసుకోవాలని ట్రై చేస్తున్నారు నెటిజన్స్. జైలర్ 2లో నటించిన మీర్నా మీనన్ రజినీ డైట్ గురించి వెల్లడించింది. మీర్నా మాట్లాడుతూ.. “ఆయన ఉదయాన్నే లేచి వ్యాయామం చేసి, ఆ తర్వాతే సెట్‌కు రావడం నాకు బాగా నచ్చుతుంది. ఆయన ఎల్లప్పుడూ కఠినమైన ఆహార నియమాలను, క్రమబద్ధమైన దినచర్యను పాటిస్తారు. ఆయన ఈత, ట్రెడ్మిల్ రన్నింగ్ చేస్తారు. మేము షూటింగ్ చేసిన చాలా ప్రదేశాలలో జిమ్ సౌకర్యాలు లేవు. అందుకే, ఆయన తన వ్యాయామ పరికరాలు తన గదిలోనే ఉండేలా చూసుకున్నారు” అంటూ చెప్పుకొచ్చారు.
ఆయన ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడుతూ.. “ఆయన ఏమి తింటారో నేను చూడలేదు, కానీ ఆయన మసాలా లేదా నూనెతో కూడిన ఆహారాన్ని ఇష్టపడరని సెట్స్‌లో విన్నాను. ఆయన ఎక్కువగా పాలు, పెరుగు, తెల్ల అన్నం, చక్కెర వంటి తెల్లటి ఆహార పదార్థాలను తినరు. ఆయన ఎక్కువగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటారు” అంటూ చెప్పుకొచ్చారు. ఏడు పదుల వయసులోనూ రజినీ ఎంతో ఆరోగ్యంగా, ఫిట్నెస్ పై దృష్టి సారిస్తున్నారు. సెట్‌కు వచ్చే ముందు రజనీకాంత్ వర్కౌట్ చేస్తారు. అళాగే జిమ్ సౌకర్యాలు లేని ప్రదేశాలలో షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా ఆయన వ్యాయమాలు చేస్తుంటారు. శారీరక శ్రమ ఓర్పును మెరుగుపరచడానికి, కండరాల బలాన్ని కాపాడుకోవడానికి, గుండె ఆరోగ్యానికి మెట్లు ఎక్కడం, దిగడంతోపాటు ఎక్కువగా నడుస్తుంటారు.
అలాగే రజినీ రోజూ స్విమ్మింగ్ చేస్తుంటారు. ఇది గుండె స్పందన రేటును పెంచడంతో పాటు, అనేక కండర సమూహాలకు కూడా పని కల్పిస్తుంది. ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి మంచిది. ఈత వల్ల కలిగే ఒక ప్రయోజనం ఏమిటంటే, శరీరం బరువులో ఎక్కువ భాగాన్ని నీరు మోస్తుంది. కొన్ని అధిక ప్రభావం చూపే వ్యాయామాలతో పోలిస్తే, ఇది కీళ్లపై ఒత్తిడిని తగ్గిస్తుంది. చురుకుగా ఉండాలనుకునే పెద్దవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.
అళాగే ట్రెడ్ మిల్ పై పరిగెత్తడం అంటే కండరాలను బలంగా మార్చుకోవడమే. గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యానికి సహాయపడుతుంది.పరుగెత్తే అలవాటు లేని వారు సౌకర్యవంతమైన వేగంతో ట్రెడ్మిల్ వాకింగ్‌తో ప్రారంభించవచ్చు. వ్యాయామంతో పాటు, రజనీకాంత్ కఠినమైన, సరళమైన ఆహార నియమాలను పాటిస్తారని సమాచారం. ఆయన మసాలా, నూనెతో కూడిన ఆహార పదార్థాలకు దూరంగా ఉంటారని తాను విన్నట్లు మీర్నా మీనన్ చెప్పారు. నివేదికల ప్రకారం, ఆయన పాలు, పెరుగు, తెల్ల బియ్యం, చక్కెర వంటి ‘తెల్లని ఆహార పదార్థాలకు’ కూడా దూరంగా ఉంటారు. అలాగే రజినీ ఎక్కువగా రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేస్తారట. ఇందులో శరీర బరువు, రెసిస్టెన్స్ బ్యాండ్లు లేదా తేలికపాటి బరువులను ఉపయోగించే వ్యాయామాలు ఉంటాయి. తగినంత నిద్రపోవడం, తగినంత నీరు త్రాగడం, ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడం, శరీరం కోలుకోవడానికి సమయం ఇవ్వడం కూడా ముఖ్యమని రజినీ భావిస్తారు.
