AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విద్యార్థులకు విద్యాశాఖ కీలక ప్రకటన.. దసరా సెలవుల్లో ఆధార్ క్యాంపులు! ఎందుకంటే..

దసరా సెలవుల్లో విద్యార్థుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఎంఈఓ కార్యాలయాలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఆధార్ నమోదు క్యాంపులు నిర్వహించనున్నారు. ఆధార్ లేని పిల్లలు, బయోమెట్రిక్ అప్‌డేట్ అవసరమైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఆధార్‌కు సంబంధించిన ఇతర సేవలు పొందాలనుకునే ప్రజలు కూడా క్యాంపులకు హాజరుకావచ్చని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ తెలిపారు..

విద్యార్థులకు విద్యాశాఖ కీలక ప్రకటన.. దసరా సెలవుల్లో ఆధార్ క్యాంపులు! ఎందుకంటే..
Aadhaar Enrollment Camps For Students
Srilakshmi C
|

Updated on: Oct 17, 2026 | 11:29 AM

Share

హైదరాబాద్‌, అక్టోబర్ 17: దసరా సెలవుల్లో విద్యార్థులకు ఆధార్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ) కార్యాలయాలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఆధార్ నమోదు క్యాంపులు నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ అక్టోబరు 15న ప్రకటించారు. ఆధార్ లేని పిల్లలు, బయోమెట్రిక్ వివరాలను తప్పనిసరిగా అప్‌డేట్ చేసుకోవాల్సిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. దసరా సెలవుల్లో నిర్వహించే ఈ క్యాంపుల ద్వారా ఆధార్ నమోదు చేసుకోవడంతో పాటు, అవసరమైన బయోమెట్రిక్ అప్‌డేట్ సేవలను పొందవచ్చు. విద్యార్థులు మాత్రమే కాకుండా ఆధార్‌కు సంబంధించిన ఇతర సేవలు అవసరమైన ప్రజలు కూడా ఈ క్యాంపులకు హాజరుకావచ్చని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

ఆధార్ సేవలపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఎంఈఓలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులను నవీన్ నికోలస్ ఆదేశించారు. ఆధార్ నమోదు లేదా బయోమెట్రిక్ అప్‌డేట్ అవసరమైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్యాంపుల నిర్వహణకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం స్థానిక ఎంఈఓ కార్యాలయం లేదా సంబంధిత విద్యాసంస్థను సంప్రదించడం మంచిది. మరోవైపు, పాఠశాల విద్యాశాఖ పరిధిలోని సమగ్ర శిక్షా ప్రాజెక్టుకు ఐఎస్‌ఓ 9001:2015 ధ్రువీకరణ లభించినట్లు నవీన్ నికోలస్ వెల్లడించారు. నాణ్యమైన పరిపాలన, పారదర్శక ఆర్థిక నిర్వహణ, విద్యా ప్రమాణాల మెరుగుదలకు సమగ్ర శిక్షా ప్రాజెక్టు చేస్తున్న కృషికి ఈ గుర్తింపు లభించిందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

విద్యా వ్యవస్థలో పరిపాలనా ప్రమాణాలను మెరుగుపరచడం, ఆర్థిక నిర్వహణలో పారదర్శకతను పెంపొందించడం, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు చేపడుతున్న కార్యక్రమాలకు ఈ ధ్రువీకరణ గుర్తింపుగా నిలుస్తుందని విద్యాశాఖ పేర్కొంది.

Follow Us