టెంప్టింగ్ లుక్స్ తో టెంపర్  లేపుతున్న కావ్య శ్రీ

16-10-2026

Pic credit - Instagram

Phani Ch

తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని కావ్య శ్రీ. గోరింటాకు సీరియల్ ద్వారా తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

కర్ణాటకకు చెందిన కావ్య, మొదట కన్నడ సీరియల్స్‌తో తన నట జీవితాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత తెలుగులో వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్టార్ సీరియల్ నటిగా ఎదిగింది.

2019లో నిఖిల్ మలియక్కల్ తో కలిసి గోరింటాకు సీరియల్ చేసింది. వీరిద్దరి జోడికి తెలుగు అడియన్స్ ఫిదా అయ్యారు. దీంతో తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

సీరియల్ యాక్టర్ నిఖిల్ తో ప్రేమాయణం నడిపించింది. దాదాపు ఐదేళ్లపాటు నిఖిల్ తో ప్రేమాయణం నడిపింది. ఈమధ్య వీళ్ళిద్దరూ బ్రేకప్ చెప్పుకున్న విషయం తెలిసిందే.

సీరియల్స్‌తో పాటు పలు ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఈవెంట్లు, స్పెషల్ టెలివిజన్ షోలలో పాల్గొంటూ నిరంతరం తెలుగు అభిమానులను అలరిస్తూనే ఉంది ఈ కన్నడ బ్యూటీ.

సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉంటూ తన లేటెస్ట్ ఫ్యాషన్ వేర్ మరియు ట్రెడిషనల్ ఫోటోలను తరచూ షేర్ చేస్తూ లక్షలాది మంది ఫాలోవర్లను అలరించడం కావ్యకు అలవాటు.

ప్రస్తుతం కెరీర్‌పై పూర్తి దృష్టి పెట్టిన కావ్య శ్రీ, మునుముందు వెండితెరపై కూడా మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలలో కనిపించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.