డాక్టర్ బాబు గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన హిమ, అతడి క్యారెక్టర్ గురించి ఏం చెప్పిందంటే ?
కార్తీక దీపం సీరియల్‌కు ఏ రేంజ్ ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐపీఎల్ ఉన్నా, హిట్ మూవీ తొలిసారి టీవీలో ప్లే అవుతున్నా ..కార్తీక దీపం ఎపిసోడ్ రేటింగ్ ఎంతమాత్రం తగ్గదు.
కార్తీక దీపం సీరియల్‌కు ఏ రేంజ్ ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐపీఎల్ ఉన్నా, హిట్ మూవీ తొలిసారి టీవీలో ప్లే అవుతున్నా ..కార్తీక దీపం ఎపిసోడ్ రేటింగ్ ఎంతమాత్రం తగ్గదు. ఇక అందులో వివిధ పాత్రలు పోషించేవాళ్లు తెలుగు లోగిళ్లలో సొంత మనుషులుగా మారిపోయారు. వారి గురించి తెలుసుకోవాలనే ఇంట్రస్ట్ జనాలకు పెరిగింది. అందుకే మీ కోసం ఓ క్రేజీ అప్‌డేట్ తెచ్చాం.
తెర మీద అమ్మా…. హిమ అంటూ ప్రేమగా పిలిచే డాక్టర్ బాబు తెర వెనుక మాత్రం హిమని చాలా ఏడిపిస్తారట. ఈ విషయం హిమే స్వయంగా చెప్పారు. సీరియస్‌గా కాదులేండి. ఈ విషయాన్ని ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పారు హిమా, డాక్టర్ బాబు.. అదే సహృద, నిరుపమ్ సెట్లో జరిగే సరదా ఇన్సిడెంట్స్‌ను షేర్ చేసుకున్నారు. ఆఫ్ స్క్రీన్‌లో నిరుపమ్‌ని అన్నా అని.. పిలుస్తున్నా.. తనకి ఎందుకో అంకుల్ అని పిలవాలనిపిస్తుందని ఆటపట్టించారు సహృద. అంతేకాదు స్క్రీన్ మీద డీసెంట్‌గా కనిపించే డాక్టర్ బాబు.. షాట్ బ్రేక్‌లో తనను కోతి అని పిలుస్తూ తెగ ఏడిపిస్తారని చెప్పారు ‘కార్తీక దీపం’ హిమ.
వీళ్ల అల్లరికి శౌర్య కూడా తోడైతే ఇక సెట్‌లో సందడి మామూలుగా ఉండదట. నిరుపమ్ కూడా సహృద టాలెంట్ గురించి చాలానే చెప్పారు. ఈ చిన్నారి మల్టీ టాలెంటెడ్ అన్న నిరుపమ్.. తనతో కలిసి వర్క్ చేయటం ఫన్నీ ఎక్స్‌పీరియన్స్ అన్నారు.
Also Read :
బిగ్ బాస్ 4 : మోనాల్ మ్యాజిక్, సీజన్ చివర్లో షాకింగ్ ఓటింగ్, ఆటపై ఫోకస్ పెట్టిన గుజరాత్ బ్యూటీ
హద్దుల్లేని ప్రేమ, ప్రియుడి కోసం పాస్‌పోర్టు లేకుండా ఇండియాలోకి, అరెస్ట్ !