AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పూజా పాత్రలో జాన్వీ!

'బాహుబలి' తరువాత టాలీవుడ్‌ స్థాయి చాలానే పెరిగిపోయింది. ఇక్కడ సైతం ఎన్నో వైవిధ్య కథలు పుట్టుకొస్తున్నాయి.

పూజా పాత్రలో జాన్వీ!
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 29, 2020 | 8:13 PM

Share

Janhvi Kapoor in Pooja Hegde Role:‘బాహుబలి’ తరువాత టాలీవుడ్‌ స్థాయి చాలానే పెరిగిపోయింది. ఇక్కడ సైతం ఎన్నో వైవిధ్య కథలు పుట్టుకొస్తున్నాయి. దీంతో అందరి దృష్టి టాలీవుడ్‌పై పడింది. ముఖ్యంగా టాలీవుడ్‌పై కన్నేసిన బాలీవుడ్‌ ఇక్కడి సినిమాలను అక్కడ రీమేక్‌ చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొన్ని చిత్రాలు అక్కడ రీమేక్‌ అయ్యి బ్లాక్‌బస్టర్‌ అవ్వగా.. మరో అరడజన్‌కి పైగా చిత్రాల రీమేక్‌ రైట్లను బాలీవుడ్ నిర్మాతలు కొనుగోలు చేశారు. అందులో అల వైకుంఠపురములో కూడా ఒకటి. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఇక్కడ మంచి విజయం సాధించడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది. ఇక త్వరలోనే ఈ సినిమా హిందీలో రీమేక్ అవ్వబోతుంది.

ఇందులో కార్తీక్ ఆర్యన్‌, బన్నీ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ని తీసుకోవాలని మేకర్లు ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇందులో నటించేందుకు ఒప్పుకుంటే పూజా హెగ్డే పాత్రలో జాన్వీ కనిపించనుంది. కాగా జాన్వీ నటించిన గుంజనా సక్సేనా: ద కార్గిల్‌ గర్ల్‌ ఆగష్టు 14న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

Read This Story Also: ‘నాజి స్వస్తిక్’ మాస్క్‌లు ధరించిన జంటపై నిషేధం

Follow Us
అమ్మాయితో రోబో అసభ్యప్రవర్తన.. పోలీసుల దర్యాప్తులో
అమ్మాయితో రోబో అసభ్యప్రవర్తన.. పోలీసుల దర్యాప్తులో
'రిటైర్ అవ్వాలి.. లేదంటే జట్టును వీడాలి'
'రిటైర్ అవ్వాలి.. లేదంటే జట్టును వీడాలి'
సినిమా ఛాన్స్ కోసం ఆ డైరెక్టర్ అలాంటి డిమాండ్ చేశాడా..
సినిమా ఛాన్స్ కోసం ఆ డైరెక్టర్ అలాంటి డిమాండ్ చేశాడా..
'ఆ తెలుగు సినిమా అంటే పిచ్చి.. ఇప్పటివరకు 50 సార్లు చూశా'
'ఆ తెలుగు సినిమా అంటే పిచ్చి.. ఇప్పటివరకు 50 సార్లు చూశా'
చిన్నశేష వాహనంపై ద్వారకా శ్రీకృష్ణుడి అలంకారంలో మలయప్పస్వామి..
చిన్నశేష వాహనంపై ద్వారకా శ్రీకృష్ణుడి అలంకారంలో మలయప్పస్వామి..
మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకపోయినా యూపీఐ పేమెంట్స్ చేయడం ఎలా..
మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకపోయినా యూపీఐ పేమెంట్స్ చేయడం ఎలా..
కొవ్వును కరిగించి.. జుట్టుకు, గుండెకు మేలు చేసేచ అద్భుతమైన ఫుడ్..
కొవ్వును కరిగించి.. జుట్టుకు, గుండెకు మేలు చేసేచ అద్భుతమైన ఫుడ్..
టీ20ల్లో బుడ్డోడి అరాచకంపై ఓ లుక్కేయండి..!
టీ20ల్లో బుడ్డోడి అరాచకంపై ఓ లుక్కేయండి..!
భోజనం పెడితే లక్ష..భోజనం చేస్తే రూ.50 వేలు జరిమానా..ఎక్కడో తెలుసా
భోజనం పెడితే లక్ష..భోజనం చేస్తే రూ.50 వేలు జరిమానా..ఎక్కడో తెలుసా
హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌..డిసెంబర్‌ నుంచి నీటి కష్టాలు తప్పవా?
హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌..డిసెంబర్‌ నుంచి నీటి కష్టాలు తప్పవా?