Kannada actor Diganth: కన్నడ హీరో దిగంత్‌కు అడ్వెంచర్స్ చేయడం అంటే ఇంట్రెస్ట్. సైకిలింగ్, ట్రెక్కింగ్, స్కూబా డైవింగ్ చేస్తుంటాడు. అంతే కాదు ఈ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. భార్య ఐంద్రిత రేతో గోవా పర్యటనకు వెళ్లిన హీరో దిగంత్ అక్కడ బీచ్‌లో ట్రంపోలిన్ జంప్ చేస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. పడిపోయినప్పుడు అతని వెన్నెముకకు తీవ్ర గాయమైంది. గోవాలో ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక విమానంలో బెంగళూరుకు తరలించారు. బెంగళూరులోని హాల్ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్న దిగంత్‌ను వెంటనే మణిపాల్ హాస్పిటల్‌కు తరలించారు. అతను సర్వికల్ స్పైన్ ఇన్‌జ్యురితో బాధపడుతున్నట్టు MRI ద్వారా గుర్తించారు డాక్టర్లు. అతనికి సర్జరీ చేయాల్సి ఉందని వైద్యులు ప్రకటించారు.
ఐదేళ్ల క్రితం టికెట్ టు బాలీవుడ్ అనే హిందీ సినిమా షూటింగ్‌లో దిగంత్‌కు కంటికి గాయమైంది. దిగంత్ తెలుగు ప్రేక్షకులకు కూడా తెలుసు. వాన మూవీలో సెకండ్ హీరో నటించాడు. చివర్లో మీరా చోప్రాను పెళ్లి చేసుకోవడానికి వచ్చే జవాన్‌గా నటించింది దిగంతే. గాలిపాట, హౌస్‌ఫుల్ వంటి చిత్రాలతో కూడా పేరు తెచ్చుకున్నాడు దిగంత్. తెలుగులో భారీ విజయం అందుకున్న ఎవరు మూవీ రీమేక్‌లో నటిస్తున్నాడు. అడివి శేష్ పాత్రలో దిగంత్ నటిస్తున్నాడు.
దిగంత్ ప్రమాదం బారిన పడటంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ దిగంత్ అభిమానులతోపాటు.. పలువురు సెలబ్రిటీలు ఆకాంక్షిస్తున్నారు.
మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..